పుర పోరు లో ముగిసిన నామినేషన్ల ఘట్టం
(నేటి దినపత్రిక సూర్య బ్యూరో-రాజమహేంద్రవరం) తూర్పు గోదావరి ,డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ కోనసీమ జిల్లాలలోని 5 మున్సిపాలిటీలు ,ఒక నగర పంచాయతీ పరిధిలో పుర పోరుకు సంబంధించి నామినేషన్ల కార్యక్రమం ఆదివారం తో ముగిసింది .దీంతో సోమవారం నుండి నామినేషన్ల పరిశీలన కార్యక్రమాన్ని ఎన్నికల అధికా ర యంత్రాంగం చేపట్టనుంది.ఇక తూర్పు గోదావరి జిల్లా పరిధిలో ఉన్న ఏకైక నగరపాలక సంస్థ ఎన్నికలు సాంకేతిక కారణాలతో వాయిదాపడింది .మండపేట ,కొవ్వూరు ,నిడదవోలు మున్సిపాలిటీలకు ఇప్పుడు నామినేషన్ల పర్వం జరిగింది .డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ కోనసీ మ జిల్లా పరిధిలో అమలాపురం ,రామచంద్రాపురం మున్సిపాలిటీ లతో పాటు ముమ్మిడివ రం నగరపంచాయతీకి ఎన్నికలు జరుగుతున్నాయి. వైసీపీ ఒంటరిగా బరిలోకి దిగింది .ఇక 2024 ఎన్నికల మాదిరిగానే స్థానిక ఎన్నికలలోను పొత్తుతో ముందుకు సాగుతున్నాయి.టీడీపీ మండపేట ,కొవ్వూరు,రామచంద్రపురం స్థానాల్లో మరియు జనసేన నిడదవోలు ,అమలాపు రం మున్సిపాలిటీలు ,ముమ్మిడివరం నగర పంచాయతీల నుండి చైర్మన్ స్థానాలకు తమ అభ్యర్థులను బరిలోకి దించాయి.ఈ రెండు జిల్లాల పరిధిలో రాజమహేంద్రవరం నగర పాల క సంస్థను బిజెపికి కేటాయించారు.ఇక అభ్యర్థుల పరంగా మండపేటలో కూటమి అభ్యర్థిగా వేగుళ్ల అజయ్ బాబు,వైసీపీ నుండి ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యుడు డాక్టర్ కె.రాము ప్రధానంగా పోటీచేస్తున్నారు.కాంగ్రెస్ నుండి అలమండ సూరిబాబు పోటీకి దిగారు.కొవ్వూరు నుండి కూ టమి అభ్యర్థిగా కంఠంనేని విజయలక్ష్మి,వైసీపీ అభ్యర్థిగా ఇంకా అధిష్టానం నుండి స్పష్టత లే కపోవడంతో గండ్రోతు అంజలీదేవి ,గండ్రోతు దుర్గ లావణ్య,ఏలూరు విజయ లక్ష్మి,గంట స్వా తికిరణ్ ప్రస్తుతానికి నామినేషన్లు దాఖలు చేశారు .నిడదవోలు నుండి కూటమి అభ్యర్థిగా క ళ్లెం జ్యోతి ,వైసీపీ నుండి వేదాల విజయలక్ష్మి ,కాంగ్రెస్ నుండి చిన్నం అమృతవల్లి నామినే షన్ దాఖలు చేశారు.రామచంద్రాపురంలో కూటమి నుండి మేడిశెట్టి శేషారావు ,వైసీపీ నుం డి చింతపల్లి నాగేశ్వరరావు ,అమలాపురంలో కూటమి నుండి నల్లా శ్రీధర్ ,వైసీపీ నుండి దూ డల వీరితా దేవి,కాంగ్రెస్ నుండి ముషిని ఎస్.కె.ఎన్. మణి నామినేషన్లు దాఖలు చేశారు.ఇక ముమ్మిడివరం నగర పంచాయతీ నుండి కూటమి అభ్యర్థిగా గుబ్బల రత్నగంగాభవాని,వైసీ పీ నుండి సానబోయిన వినీలాదేవి నామినేషన్లు దాఖలు చేసారు. ఈ రెండు జిల్లాల పరిధిలో ఎన్నికల అధికారులు ,పోలీస్ యంత్రాంగం సమిష్టిగా వ్యవహరించి నామినేషన్ల ఘట్టాలను ప్రశాంతంగా నిర్వహించారు.శని ,ఆదివారంలలో పలు చోట్ల జోరుగా వర్షాలు పడినప్పటికీ అ భ్యర్థులు నామినేషన్లను దాఖలు చేయగలిగారుఈ ఎన్నికలు ఆయా జిల్లా మంత్రులు,ఎమ్మె ల్యేలతో పాటు వైసీపీ జిల్లా అధ్యక్షులు,నియోజకవర్గ ఇంచార్జి లకు అగ్ని పరీక్ష కానున్నాయ ని చెప్పవచ్చు.పొత్తులో భాగంగా టీడీపీ,జనసేన ఆశావహులకు పెద్ద ఎత్తున ఎదురు దెబ్బ తగిలిన నేపథ్యంలో కూటమి అభ్యర్థుల విజయావకాశాలపై భిన్న ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికి ఈ ఎన్నికల్లో ఆసక్తికర పలితాలు తప్పవనే ప్రచారం జోరుగా సాగుతుంది .