ఏపీ చాంపియన్ షిప్ లో మహిళా జట్టుకు తృతీయ స్థానం
రావులపాలెంనిర్మల్‌లో ఈ నెల 16, 17, 18 తేదీల్లో నిర్వహించిన 18వ సీనియర్ సౌత్ జోన్ నేషనల్ నెట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ మహిళా నెట్‌బాల్ జట్టు మూడో స్థానం (తృతీయ స్థానం) సాధించి రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిందని రాష్ట్ర నెట్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి పల్లా శ్రీనివాసరావు ప్రకటనలో తెలిపారు
ఈ ఘన విజయాన్ని పురస్కరించుకుని సౌత్ జోన్ నెట్‌బాల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ గిరీష్ గౌడ్, కన్వీనర్ ఆదిత్యరెడ్డి మహిళా జట్టు క్రీడాకారులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ నెట్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మరెడ్డి కృష్ణారెడ్డి, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బూదోటి శివారామ్ కూడా క్రీడాకారులను అభినందించారు. జట్టు సాధించిన ఈ విజయాన్ని ప్రశంసిస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.