ముగిసిన నామినేషన్ల ఘట్టం చివరిరోజు జోరుగా మేయర్ అభ్యర్థికి నామినేషన్లు
నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్
నగరపాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఘట్టం ఆదివారం చివరి రోజు కావడంతో మేయర్ అభ్యర్థి కి సంబంధించి నామినేషన్లు జోరుగా పడ్డాయి. శుక్రవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ జరుగుతుండగా ఆదివారం చివరి రోజు నామినేషన్లు వివిధ పార్టీలకు చెందిన నాయకులు వేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నుంచి మేయర్ అభ్యర్థిగా రూప్ కుమార్ యాదవ్, వైయస్సార్సీపి నుంచి మేయర్ అభ్యర్థిగా ఆనం విజయకుమార్ రెడ్డిలు నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా చివరి రోజు రెండోసారి వైఎస్ఆర్సిపి మేయర్ అభ్యర్థి ఆనం విజయకుమార్ రెడ్డి నామినేషన్ వేయడం జరిగింది. అలాగే జనసేన నుంచి లాయర్ కాకు మురళి రెడ్డి, మైనార్టీ నాయకులు సయ్యద్ సమీ, కాంగ్రెస్ పార్టీ, ఇతర పార్టీ నుంచి మరి కొంతమంది మేయర్ అభ్యర్థిగా ఇండిపెండెంట్ లు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. టిడిపి రెబల్ అభ్యర్థిగా మాతంగి కృష్ణ నామినేషన్ వేయడం జరిగింది. అలాగే 72 డివిజన్లకు సంబంధించి తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సిపి, జనసేన, బిజెపి, ఇతర పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థులు, కార్పొరేటర్ అభ్యర్థులుగా నామినేషన్లు ఆయా పోలింగ్ కేంద్రాల్లో వేయడం జరిగింది. కొన్నిచోట్ల టిడిపి రెబల్ అభ్యర్థులు నామినేషన్ వేయడం జరిగింది. మొత్తం మీద నగరపాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు జోరుగానే వేయడం జరిగింది.