మూడు కాంస్య పథకాలు సాధించిన 8 సంవత్సరాల చిన్నారి
తాడేపల్లిగూడెం, సూర్య న్యూస్; తాడేపల్లిగూడెం శ్రీ చైతన్య పాఠశాల యందు నాలుగవ తరగతి చదువుతున్న బాదం రిత్విక్ సాయి శ్రీ రామ్ (8) ఉమ్మడి పశ్చిమ గోదావరిజిల్లా, జిల్లాస్థాయి స్కేటింగ్ పోటీలలో మూడు కాంస్య పథకాలు సాధించాడు. 150 మీటర్ల రింక్ 4, 500 మీటర్ల రింక్ 5, 1000 మీటర్ల రింక్ 6, మూడు విభాగాలలోను రిత్విక్ ప్రతిభ కనబరిచి మూడు కాంస్య పథకాలు సాధించాడు. తాడేపల్లిగూడెం పట్టణ ఎస్సై బాదం శ్రీనివాస్ కుమారుడు రిత్విక్ అంచెలంచెలుగా ఎదుగుతూ ఆరు మాసాల వ్యవధిలోనే అకుంఠిత దీక్షతో తర్ఫీదు పొంది ఈ విజయం సాధించాడని తల్లిదండ్రులు బాదం శ్రీనివాస్, శ్రీమతి రమ్యకృష్ణ తెలియజేశారు. ఈ చిన్నారిని శ్రీ చైతన్య పాఠశాల ఏజీఎం పార్థసారథి, రీజనల్ ఇంచార్జ్ శివ దుర్గ ప్రసాద్, కోఆర్డినేటర్ రామారావు, ప్రధానోపాధ్యాయురాలు విజయ పాఠశాల సిబ్బంది అభినందనలు తెలియజేశారు.
రిపోర్టర్ శ్రీనివాస్ తాడేపల్లిగూడెం పశ్చిమగోదావరి జిల్లా,