మూడవ వార్డు అభివృద్ధియే లక్ష్యం.
మడకశిర, మేజర్ న్యూస్: మడకశిర పట్టణంలోని 3వ వార్డు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థిగా పట్టణ యువజన విభాగ అధ్యక్షుడు శివన్న గారి బాబు బరిలో నిలవనున్నారు. ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా, వార్డు అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని ఆయన తెలిపారు. తనకు అవకాశం కల్పిస్తే 3వ వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.వార్డులో మెరుగైన రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణం, కాలుష్య నివారణకు చర్యలు చేపట్టడం, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో తాగునీటి ప్లాంట్ ఏర్పాటు చేయడం తన ప్రధాన లక్ష్యాలని తెలిపారు. అలాగే బస్టాండ్ నుంచి శివాలయానికి వెళ్లే మార్గంలో ఆర్చ్ నిర్మాణం, దళితుల స్మశానవాటికకు ప్రహరీ గోడ నిర్మాణం, ప్రభుత్వ నిధులతో సచివాలయ భవన ఏర్పాటుకు కృషి చేస్తానని వెల్లడించారు.ప్రజలకు అందుబాటులో ఉంటూ వార్డులో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి, వార్డు రూపురేఖలు మార్చడమే తన కర్తవ్యమని బాబు పేర్కొన్నారు. ప్రజలు తనను ఆదరించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
మడకశిర సూర్య ఆర్సి ఇంచార్జ్ శివరాజు