BREAKING
పోలీస్ స్పోర్ట్స్ మీట్ లో పతకాలు సాధించిన పోలీస్ క్రీడాకారులను అభినందించిన వరంగల్ సిపి శ్రీ పద్మాక్షి దేవాలయ శరన్నవరాత్రి ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ దంపతుల కొత్త సినిమా 'తూ హై మేరీ కిరణ్' ట్రైలర్ విడుదల! జాతీయ అవార్డు గ్రహీత చంద్రకళకు పోలీస్ శాఖ సత్కారం గ్రామీణ ప్రజలకు వైద్యం మరింత చేరువ: ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఎస్పీ బాలుతో ఆ జ్ఞాపకం ఇప్పటికీ మరువలేను.. ఎస్వీ కృష్ణా రెడ్డి ఎమోషనల్ పోస్ట్! చెత్తను సద్వినియోగం చేసుకోవాలి ఆశావర్కర్స్కు కనీసవేతనాలు చెల్లించాలి. అయోడిన్ లోప రుగ్మతల నియంత్రణకు జిల్లా స్థాయి సర్వే.. ఎముకల ఆరోగ్యం: వయసు పెరుగుతున్న కొద్దీ ఎముకలు దృఢంగా ఉండాలంటే రోజూ ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ప్రొటీన్ లోపం రాకుండా ఉండాలంటే రోజువారీ మన శరీరానికి ఎంత ప్రొటీన్ అవసరమో తెలుసా? ఐరన్ లోపం: శరీరంలో హిమోగ్లోబిన్ తగ్గి అలసట, తల తిరగడానికి అసలు కారణం ఏమిటో తెలుసా? కరీనా షోలో షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్‌‌పుత్.. ఆ యాడ్ వివాదంపై కృతి సనన్ షాకింగ్ కామెంట్స్! లక్ష్మీపోలవరంలో అంగన్వాడీ ఉత్సవ్ ప్రజలకు శుభ్రమైన తాగునీరు అందేలా చర్యలు

మత్స్యకార కుటుంబాల జీవనోపాధిని రాజకీయ ప్రయోజనాల కోసం దెబ్బతీయవద్దు హైకోర్టు ఉత్తర్వులు అమలులో ఉండగా రాజకీయ జోక్యం ఎందుకు?

Select Suryaa Now
మత్స్యకార కుటుంబాల జీవనోపాధిని రాజకీయ ప్రయోజనాల కోసం దెబ్బతీయవద్దు  హైకోర్టు ఉత్తర్వులు అమలులో ఉండగా రాజకీయ జోక్యం ఎందుకు?

 

టి.నరసాపురం:మేజర్ న్యూస్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు అమలులో ఉన్న సమయంలో మత్స్యకారుల వ్యవహారాల్లో రాజకీయ జోక్యం ఎందుకని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా మత్స్యకారుల సంఘం మాజీ కార్యవర్గ సభ్యులు గుండె చిన్న చిట్టయ్య ప్రశ్నించారు.మీడియాతో ఆయన మాట్లాడుతూ.. సోమవారం బొర్రంపాలెంలో పర్యటించిన గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు అమలులో ఉన్న సమయంలో మత్స్యశాఖ అధికారిని పిలిపించుకోవడం మత్స్యకారుల్లో తీవ్ర ఆందోళనకు కారణమైందన్నారు.

గృహ నిర్మాణ శాఖ మంత్రికి బొర్రంపాలెం మత్స్యకారుల వ్యవహారాలతో సంబంధం ఏమిటని ప్రశ్నించారు. ఆయన మత్స్యశాఖ మంత్రి కాదని, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కూడా కాదని పేర్కొంటూ.మత్స్యశాఖ అధికారిని ఏ కారణంతో పిలిపించారో మంత్రి, సంబంధిత అధికారులు స్పష్టమైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.హైకోర్టు ఉత్తర్వులు అమలులో ఉన్న సమయంలో మత్స్య సహకార సంఘం కార్యకలాపాల్లో ఎవరైనా జోక్యం చేసుకోవడం, మత్స్యకారుల లీజు హక్కులకు ఆటంకం కలిగించడం లేదా అధికారులపై ఒత్తిడి తీసుకురావడం జరిగితే, సంబంధిత అంశాలను గౌరవ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లి కోర్టు ధిక్కరణ చర్యలకు సంబంధించి న్యాయపరమైన చర్యలు చేపడతామని చిట్టయ్య హెచ్చరించారు.186 మత్స్యకార కుటుంబాల జీవనోపాధిని రాజకీయ ప్రయోజనాల కోసం దెబ్బతీయవద్దని ఆయన కోరారు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని హైకోర్టు ఉత్తర్వులను పూర్తిస్థాయిలో అమలు చేయాలని, కోర్టు ఉత్తర్వుల ప్రకారం మత్స్యకారుల లీజు హక్కులకు, వారి జీవనోపాధికి రక్షణ కల్పించాలని కోరారు.

 అద్దంకి గిరి కుమార్ క్రైమ్ రిపోర్టర్