మైనార్టీల పట్ల బహిర్గీతమైన టిడిపి వివక్ష, వైసిపి నేత సయ్యద్ గౌస్ మోహిద్దీన్,
మార్కాపురం, మేజర్‌న్యూస్ :
అణగారిన వర్గాల ఓట్లు తీసుకొని వారిని వంచించడం తమ నైజాం అని టిడిపి సర్కార్ మరోసారి రుజువు చేస్తుందని వైసీపీ మైనార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ గౌస్ మోహిద్దీన్ విమర్శించారు. మైనార్టీలను అనునిత్యం మోసం చేస్తూ వస్తున్న పార్టీ టిడిపి అని ఆయన ధ్వజమెత్తారు. గత ఎన్నికల్లో మైనార్టీలకు అనేక హామీలు ఇచ్చి మోసం చేసిన కూటమి సర్కార్ తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో మైనార్టీలకు తీరని అన్యాయం చేస్తుందని విమర్శించారు. మార్కాపురం పట్టణ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గా ముస్లింలను ఎంపిక చేయడం ఆనవాయితీగా వస్తోందని, వాటిని తుంగలో తొక్కి ముస్లింలను తాజాగా కూటమి సర్కార్ మోసం చేసిందని విమర్శించారు. మార్కాపురం పట్టణ మున్సిపల్ వైస్ చైర్మన్ గా ముస్లింలకు అవకాశం ఇవ్వకుండా, ఇతరులకు అవకాశం కల్పించడం టిడిపి మోసపూరిత విధానానికి నిదర్శనం అన్నారు. తమ హయాంలో షాదీఖాన నిర్మాణ పనులు చేయాలని నాడు కెమెరాలు పట్టుకొని షాదిఖానా చుట్టూ ప్రదక్షిణలు చేసిన జనసేన నాయకులు ఇప్పుడు ఏమయ్యారని అయన ప్రశ్నించారు. ఇప్పుడు కూటమి సర్కార్ పాలిస్తోందని షాదీఖా నిర్మాణం ఎందుకు పూర్తి చెయ్యలేకపోయ్యరని జనసేన మరియు టిడిపి నేతలకు అయన ప్రశ్నించారు. చంద్రబాబు ప్రతిసారి ముస్లిం మైనార్టీలను మోసం చేయడం అలవాటుగా చేసుకున్నారని విమర్శించారు. ముస్లింలకు న్యాయం చేసింది దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన తనయుడు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మాత్రమేనని ఆయన స్పష్టం చేశాడు. వైయస్ జగన్ ముస్లింలకు అనేక ఎమ్మెల్యే సీట్లు ఎమ్మెల్సీ సీట్లు కేటాయించడమే కాకుండా మున్సిపాలిటీలో పంచాయతీల్లో పెద్ద ఎత్తున చోటు కల్పించారని ఆయన వెల్లడించారు. ఒకసారి వైసీపీ పాలనను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుందన్నారు. ఇప్పటికైనా ముస్లింలు టిడిపి సర్కార్ చేసిన ద్రోహాన్ని గుర్తించి మరోసారి వైసీపీని బలంగా బలపరచాలని ఆయన పిలుపునిచ్చారు. వైసీపీతోనే రాష్ట్రంలోని ముస్లింల భవిష్యత్తు ముడిపడి ఉందని ఆయన తేల్చి చెప్పారు. ఏపీలో రాబోయేది వైసీపీ సర్కారేనని అప్పుడే ముస్లింలకు పూర్తిస్థాయిలో న్యాయం జరుగుతుందని ఆయన ధిమా వ్యక్తం చేశారు.