BREAKING
ఎల్‌నినో ప్రభావంతో ఉపాధి కోల్పోకుండా గ్రామీణ కూలీలకు పనులు కల్పించాలి అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందడుగు ఝరాసంగం మండలాన్ని కరువు మండలంగా గుర్తించడంపై హర్షం ఉక్రెయిన్‌కు మరో 10 బిలియన్ల పౌండ్ల ఆర్థిక, సైనిక సాయం ప్రకటించిన బ్రిటన్ ఇటలీ రాజకీయాల్లో కలకలం రేపిన న్యాయస్థానం తీర్పు.. ప్రధాని జార్జియా మెలోని తీవ్ర ఆగ్రహం లక్ష్మమ్మ ఫ్యాన్ గుర్తుకే ఓటు క్షయవ్యాధి నియంత్రణకు మెరుగైన వైద్యసేవలు కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయండి టీడీపీలోకి నాగిరెడ్డిపల్లె గ్రామ నాయకులు రంగారెడ్డి జిల్లా టీజీఓ సంఘం కోశాధికారిగా దేదీప్య రేవతి ఏకగ్రీవ ఎన్నిక జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ లో అర్హత సాధించిన శిద్దా ఆరాధ్య ఎల్లంపేటలో భవన నిర్మాణంపై ఆరోపణలు.. అధికారుల తనిఖీలు ఎప్పుడు..? ప్రజా సేవే ప్రధమ కర్తవ్యంగా.. గ్రామాల అభివృద్ధికి పాటుపడాలి భూ సమస్యల పరిష్కారానికి రీ సర్వే..-తహసీల్దార్ శ్రీకాంత్

మైదుకూరు టిడిపి మున్సిపల్ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన ధన్‌పాల్ జగన్‌కు ఘన సన్మానం.

Select Suryaa Now
మైదుకూరు టిడిపి  మున్సిపల్  చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన ధన్‌పాల్ జగన్‌కు ఘన సన్మానం.

​కావలి మేజర్ న్యూస్ :  రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ప్రాదేశిక ఎన్నికల వేళ రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. వైయస్ఆర్ జిల్లా, మైదుకూరు మున్సిపల్ చైర్మన్‌గా తెలుగుదేశం పార్టీ తరఫున ధన్‌పాల్ జగన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో కావలి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ ఉపాధ్యక్షులు మన్నవ రవిచంద్ర తమ పార్టీ శ్రేణులతో కలిసి బుధవారం మైదుకూరులోని ధన్‌పాల్ జగన్ నివాసానికి వెళ్లారు.  
​ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్‌గా ఏకగ్రీవ ఎన్నిక లాంఛనం ముగిసిన తర్వాత, ధన్‌పాల్ జగన్‌ను మన్నవ రవిచంద్ర బృందం శాలువాతో సత్కరించి ఘనంగా అభినందించారు. ఈ మర్యాదపూర్వక భేటీలో స్థానిక సంస్థల ఎన్నికల సరళి, గెలుపు వ్యూహాలు మరియు నెల్లూరు జిల్లాతో పాటు రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఇరు నేతలు కొద్దిసేపు చర్చించుకున్నారు.  
​ఈ కార్యక్రమంలో మన్నవ రవిచంద్రతో పాటు కావలి తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు మంచాల ప్రసాదు, చౌదరి తదితరులు పాల్గొని నూతన చైర్మన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.