BREAKING
మరోసారి తారక్‌తో జక్కన్న కాంబో: టాలీవుడ్‌‌లో హాట్ టాపిక్‌గా మారిన క్రేజీ ప్రాజెక్ట్ అంగన్వాడీకేంద్రాల్లోఘనంగాఉత్సవంకార్యక్రమం విద్వేషా దూషణలతో కాలక్షేపం చేస్తూ పరిపాలనను గాలికి వదిలేశారు..మాజీ మంత్రి పువ్వాడ ఆరోపణ. అక్టోబర్ 2న థియేటర్లలోకి విభిన్న కథాంశంతో వస్తున్న టాలీవుడ్ మూవీ ఇంప్యూర్ టోరెంట్ ఫార్మాపై మోతీలాల్ ఓస్వాల్ కవరేజ్ ప్రారంభం: 'న్యూట్రల్' రేటింగ్ కేటాయింపు.. కాలేజీనిసమర్ధవంతంగానిర్వహించినకరెస్పాండెంట్రాధాకృష్ణయ్య ఆజాద్ ఇంజనీరింగ్‌కు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ రేటింగ్ అప్‌గ్రేడ్: దీర్ఘకాలిక వృద్ధి దృష్ట్యా పెరిగిన టార్గెట్ మండల స్థాయి కబడ్డీ పోటీల్లో కృష్ణవేణి పాఠశాల విద్యార్థుల విజయదుందుభి! గ్రామీణ ప్రాంతాల్లో చైన్ స్నాచర్ల హల్‌చల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో బీపీఎం రంగంలో భారీ మార్పులు: ప్రపంచ ఇంటెలిజెంట్ ఆపరేషన్స్ హబ్‌గా భారత్.. నాస్కామ్ వెల్లడి LT, HT విద్యుత్ కనెక్షన్లకు యూనిఫాం సర్వీస్ లైన్ ఛార్జీలు – పారదర్శకత, సరళత, వేగవంతమైన సేవలు ఆగస్టులో దేశీయ విమాన ప్రయాణికుల రాకపోకల్లో 7.5 శాతం తగ్గుదల: ఐఏటీఏ నివేదిక వెల్లడి పాపంపేట జెడ్పీ ఉన్నత పాఠశాలకు అదనపు తరగతి గదులు నిర్మించాలి.. బదిలీపై వెళ్లిన ఎస్సీ సంక్షేమ శాఖ అధికారికి సన్మానం తెలుగు రాష్ట్రాల్లో ఉపరితల ద్రోణుల ప్రభావం పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సూచన

మద్యం షాపుల టెండర్ల ప్రక్రియపై ఎక్సైజ్ అధికారుల సమీక్ష

Select Suryaa Now
మద్యం షాపుల టెండర్ల ప్రక్రియపై ఎక్సైజ్ అధికారుల సమీక్ష

భీమవరం మేజర్ న్యూస్ :ఎక్సైజ్ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు, ప్రొహిబిషన్ & ఎక్సైజ్ జాయింట్ కమిషనర్, నోడల్ ఆఫీసర్ బి. అరుణరావు ఈరోజు భీమవరంలోని జిల్లా ఎక్సైజ్ అధికారి కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఏలూరు డిప్యూటీ కమిషనర్ బి. శ్రీలత, అసిస్టెంట్ కమిషనర్ ఎన్. ప్రభుకుమార్ మరియు పశ్చిమ గోదావరి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ బి. సుబ్బారావు హాజరై జిల్లాలోని మద్యం షాపుల కేటాయింపులపై చర్చించారు.ప్రధానంగా జిల్లా వ్యాప్తంగా మిగిలిపోయిన 25 మద్యం షాపులకు డ్రా విధానం ద్వారా కేటాయింపులు జరిపే ప్రక్రియను అధికారులు సమీక్షించారు. భీమవరం పరిధిలో 09, ఆకివీడులో 06, తణుకులో 05, నరసాపురంలో 03, ఉండి (గుండం) పరిధిలో 02 షాపులు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. జిల్లాలో సిండికేట్లకు తావులేకుండా, కలెక్టర్ సమక్షంలో పారదర్శకంగా లాటరీ పద్ధతి ద్వారా ఎన్నిక జరగాలని, ప్రతి షాపునకు కనీసం 10 దరఖాస్తులైనా వచ్చేలా చూడాలని ఆదేశించారు.ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా లైసెన్సుదారులు సహకరించాలని, వ్యాపార ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎక్సైజ్ అధికారి కోరారు. టెండర్ల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డీసీ, ఏసీలతో పాటు అన్ని స్టేషన్ల ఎస్హెచ్ఓ (సీఐ)లకు మార్గదర్శకాలు జారీ చేశారు.

 

 శ్రీనివాస్ భీమవరం.