మద్యం దుకాణాల్లో కొరత.. బెల్ట్ షాపులకు తరలింపుపై ఆరోపణలు!
టి.నరసాపురం, సూర్య న్యూస్: ఎన్నికల వేళ టి.నరసాపురంలో మద్యం సరఫరాపై చర్చ మొదలైంది. మద్యం దుకాణాల్లో వినియోగదారులు కోరుకునే బ్రాండ్లు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నారని సమాచారం. మరోవైపు ఎన్నికల నేపథ్యంలో మద్యం బెల్ట్ షాపులకు తరలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సుమారు 10 వేల జనాభా ఉన్న పంచాయతీ పరిధిలో 10 నుంచి 15 వరకు బెల్ట్ షాపులు ఉన్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంపై ఎక్సైజ్ అధికారులు దృష్టి సారించి తనిఖీలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
క్రైమ్ రిపోర్టర్ అద్దంకి గిరి కుమార్ ఏలూరు జిల్లా,