BREAKING
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి విజయదశమి వేళ రాజరాజేశ్వరీ దేవిగా దుర్గమ్మ దర్శనం విజయవాడలో కూటమి సమష్టి కార్యాచరణ.. - అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ గెలుపునకు ప్రత్యేక వ్యూహం మహర్నవమి వేడుకల్లో ఆయుధ పూజలు.. - పోలీస్‌ కమిషనర్‌ దంపతుల ప్రత్యేక పూజలు 76వ డివిజన్‌లో గాదిరాజు శ్రీనివాసరాజుకు మద్దతుగా బొండా ఉమా ప్రచారం కృష్ణా జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నగారా ఉయ్యూరు అభివృద్ధే లక్ష్యం.. ప్రజా సంక్షేమమే ధ్యేయం మచిలీపట్నం అభివృద్ధే నా ధ్యేయం : కూటమి మేయర్ అభ్యర్థి షేక్ అబ్దుల్ అబీదా స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి స్థానిక ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ దసరా మెగా కార్నివాల్‌.. విజయవాడలో ట్రాఫిక్‌ మళ్లింపులు విజయవాడ ఉత్సవ్ 2.0లో ‘క్యాస్ట్’ చిత్ర బృందం సందడి నేటి పంచాంగం 20 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –20 అక్టోబర్ 2026 శ్రీవారి అలంకరణలో కదిరి నరసింహ స్వామి

మదనపల్లి 13,14 వార్డుల బరిలో శ్రీరామ హరిహరన్,లక్ష్మి దీపిక

Select Suryaa Now
మదనపల్లి 13,14 వార్డుల బరిలో శ్రీరామ హరిహరన్,లక్ష్మి దీపిక
 
మదనపల్లి టౌన్,మేజర్ న్యూస్ : మదనపల్లి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ తరపున 13,14వ వార్డులకు మదనపల్లి జనసేన పార్టీ యువనాయకులు శ్రీరామ హరిహరన్ ఆయన సతీమణి శ్రీరామ లక్ష్మి దీపికలు ఆదివారం నామినేషన్లు దాఖలు చేశారు.పార్టీ సిద్ధాంతాలు,అధినేత పవన్ కళ్యాణ్,ఆశయాలకు అనుగుణంగా ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలనే సంకల్పంతో వారు ఎన్నికల బరిలో నిలిచారు.మదనపల్లి పట్టణ అభివృద్ధికి,వార్డుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు,పారిశుద్ధ్యం,తాగు నీరు,రహదారుల వంటి ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలనే లక్ష్యంతో వారు ముందుకు సాగుతున్నారు.ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు,జనసైనికులు,కార్యకర్తలు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ,ప్రజల ఆశీస్సులు మద్దతు లభించాలని ఆకాంక్షించారు.
 
రిపోర్టర్ : కె. ఈశ్వర్ రెడ్డి, మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి