మదనపల్లె,రామసముద్రం ఎంపీపీల ఆత్మీయ కలయిక : టిడిపి నేత బొమ్మిశెట్టి పురుషోత్తం ఆధ్వర్యంలో ఘనసన్మానం
మదనపల్లె టౌన్,మేజర్ న్యూస్ : మునిసిపల్ చైర్మన్ శ్రీరామ్ కుమార్ (చినబాబు) ప్రమాణ స్వీకారోత్సవాన్ని పురస్కరించుకొని మదనపల్లె మండల పరిషత్ అధ్యక్షుడు (ఎంపీపీ) బీదం గురునాథ్ యాదవ్,రామసముద్రం ఎంపీపీ విజయ్ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకుని,శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఇరువురు నాయకులు పరస్పరం అభినందనలు తెలియజేసుకుంటూ,తమ తమ విజయాలు,రాజకీయ ప్రస్థానం గురించి చర్చించుకున్నారు.అనంతరం మదనపల్లె,రామసముద్రం మండలాలను ఏ విధంగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలనే అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.మండలాల్లో నెలకొన్న స్థానిక సమస్యలు,మౌలిక సదుపాయాల కల్పన,ప్రజలకు మెరుగైన వసతులు అందించడం వంటి అంశాలపై చర్చించారు.అభివృద్ధి కార్యక్రమాల అమలులో స్థానిక ఎమ్మెల్యే ఎం.షాజహాన్ బాషా,మదనపల్లె మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి శ్రీరామ్ (చినబాబు),జిల్లా పరిషత్ చైర్మన్ సుగవాసి ప్రసాద్ బాబు వారి సలహాలు,సూచనలు,అనుభవాలను ఉపయోగించుకోవాలని వారు అభిప్రాయపడ్డారు.పెద్దల మార్గదర్శకత్వం,సహకారంతో తమ తమ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయాలని ఇరువురు నాయకులు నిర్ణయించుకున్నారు.ఇందులో వారిని టీడీపీ చేనేత విభాగం రాష్ట్ర నాయకులు బొమ్మిశెట్టి పురుషోత్తం శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మదనపల్లి ఎంపిపి గురునాథ్ యాదవ్,రామసముద్రం మండలం ఎంపిపి విజయ్ కుమార్ గౌడలు ఇద్దరు సమర్ధవంతమైన నేతలని వారి సారధ్యంలో రెండు మండలాలు అభివృద్ధి పథంలో నడవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో రెడ్డి రాయల్,కూటమి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి