మదనపల్లెలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ 80 ఫిర్యాదుల స్వీకరణ
మదనపల్లెలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’
80 ఫిర్యాదుల స్వీకరణ
మదనపల్లె, అన్నమయ్య జిల్లా, సెప్టెంబరు 28:
మదనపల్లెలో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో ప్రజల నుంచి అధికారులు ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి, ఐపీఎస్ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ (పరిపాలన) శ్రీ ఎం. వెంకటాద్రి ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మొత్తం 80 ఫిర్యాదులు అందాయి. వాటిలో భూ వివాదాలకు సంబంధించి 35, ఆర్థిక వివాదాలు 11, న్యూసెన్స్ 7, పరిపాలనా సంబంధిత 7, ఇతర సమస్యలు 7, కుటుంబ వివాదాలు 6, సైబర్ నేరాలకు సంబంధించి 4, దొంగతనాలకు సంబంధించినవి 3 ఉన్నాయి.ప్రజలు అందించిన ఫిర్యాదులను పరిశీలించి, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చట్టపరమైన చర్యలు చేపట్టాలని అదనపు ఎస్పీ అధికారులను ఆదేశించారు. ప్రతి ఫిర్యాదును బాధ్యతగా పరిశీలించి, నిబంధనల ప్రకారం పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి హాజరు కాలేని వారు తమ సమస్యలను సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేయవచ్చని అధికారులు తెలిపారు.