మాతృమూర్తికి ఘన నివాళులు అర్పించిన ధర్మాన సోదరులు...
పోలాకి సెప్టెంబర్ 30 మేజర్ న్యూస్ : స్వర్గీయ శ్రీమతి ధర్మాన సావిత్రమ్మ 14వ వర్ధంతిని పురస్కరించుకుని పోలాకి మండలం మబగాం గ్రామంలోని ఆమె స్మారక స్థూపం వద్ద కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో ఆమె కుమారులు, మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, పద్మప్రియమ్మ దంపతులు, ధర్మాన రామదాస్, కుమార్తె కృష్ణవేణి, యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య, ధర్మాన రామలింగం నాయుడు, పాల్గొన్నారు. స్మారక స్థూపం వద్ద పూజలు నిర్వహించి ఆమెకు నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు స్వర్గీయ ధర్మాన సావిత్రమ్మ సేవలను, ఆమె ఆప్యాయతను, కుటుంబానికి అందించిన విలువలను స్మరించుకున్నారు.