BREAKING
పాల ఉత్పత్తిలో గ్రామీణ మహిళలే కీలకం -సీడీటీలో ఘనంగా జాతీయ పాల దినోత్సవం -ఉత్తమ మహిళా పాడి రైతుగా టి.విద్యకు సత్కారం రాజ్యాంగ విలువలే విద్యార్థులకు మార్గదర్శకం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని కలసిన కార్పొరేటర్ షాహినా. ఇంకొల్లు సర్పంచ్ గా షేక్ మహమ్మద్ రఫీ ఇంకొల్లు సర్పంచ్ గా షేక్ మహమ్మద్ రఫీ సదాశివపల్లిలో రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి విజ్ఞాన పరిషత్ ఎన్నికల ప్రచారం రాజ్యాంగాన్ని కాపాడుకుందాం.. ఓటు హక్కును నిలబెట్టుకుందాం! ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నీ కలిసిన కార్పొరేటర్ శంకర్ యాదవ్. గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ ఆధ్వర్యంలో సరళ ఫిజిక్స్ కాన్‌క్లేవ్`2026 కొమ్మరపూడి నామినేషన్ల తిరస్కరణపై సీపీఐ ఆందోళన! టవర్ లైట్స్ కి శంకుస్థాపన అగ్ని ప్రమాదంలో బస్సు దగ్ధం చంద్రబాబును కలిసిన కార్పొరేటర్ ఆర్ సి మునికృష్ణ ఏపిలగుంటలో పొడమేకల ముమ్మర ప్రచారం అభివృద్ధి పనులకు శంకుస్థాపన

మార్టూరు రోడ్డుకు భారీ నిధులు…..ప్రజలు సంబరాలు

Select Suryaa Now
మార్టూరు రోడ్డుకు భారీ నిధులు…..ప్రజలు సంబరాలు

మార్టూరు రోడ్డుకు భారీ నిధులు…..ప్రజలు సంబరాలు
•మార్టూరు - కొణిదెన రోడ్డుకు రూ.3.50 కోట్లు.. 
•ఎమ్మెల్యే సాంబన్న కృషి ఫలించిందాంటూ ఆనందం 
•ఏళ్ల నాటి కష్టాలకు తెర..స్వీట్లు పంచిన ప్రజలు
•నిధులు మంజూరుతో మార్టూరులో కోలాహలం
•‘జై చంద్రబాబు.. జై సాంబన్న’అంటూ నినాదాలు

 సూర్య మార్టూరు:

ఏళ్లుగా గుంతలు, దుమ్ము, ధూళితో అవస్థలు పడుతున్న మార్టూరు–కొణిదెన రహదారికి మహర్దశ పట్టనుంది. రోజూ వేలాది మంది రైతులు, కూలీలు, విద్యార్థులు, వ్యాపారులు రాకపోకలు సాగించే ఈ ప్రధాన రహదారి ఇక సరికొత్త తారురోడ్డుగా మారనుంది. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రత్యేక కృషితో రహదారి పునర్నిర్మాణానికి ప్రభుత్వం రూ.3.50 కోట్లు మంజూరు చేసింది.

3.05 కిలోమీటర్ల మేర తారు రోడ్డు...

మార్టూరు నుంచి కొణిదెన రోడ్డు వరకు విజయనగర్‌ కాలనీ మీదుగా వెళ్లే రహదారిని పునర్నిర్మించనున్నారు. వీబీ–జీ రామ్‌జీ పథకం కింద  మొత్తం సుమారు 3.05 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు నిర్మాణం జరగనుంది. 2026–27 సంవత్సరానికి వీబీ–జీ రామ్‌జీ పథకం కింద పర్చూరు నియోజకవర్గంలో మార్టూరు–కొణిదెన రహదారి పనులకు రూ.3.50 కోట్లు కేటాయించారు.

సంబరాల్లో మార్టూరు...

రహదారి నిర్మాణానికి నిధులు మంజూరైన సమాచారం తెలియడంతో మార్టూరులో స్థానిక నాయకులు, ప్రజలు ఆనందోత్సాహాలతో సంబరాలు నిర్వహించారు. స్వీట్లు పంచుకుని, బాణసంచా కాల్చి ఆనందం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కృషితోనే రహదారి పునర్నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని పేర్కొంటూ హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ప్రజలు, స్థానిక నాయకులు “జై చంద్రబాబు.. జై సాంబన్న” అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఏళ్లుగా ఎదుర్కొంటున్న రహదారి సమస్యకు పరిష్కారం లభించడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. రహదారి పూర్తయితే రైతులు పంట ఉత్పత్తులను మార్కెట్లకు తరలించడం, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు రాకపోకలు సాగించడం మరింత సులభం కానుంది. ఈ సందర్భంగా మార్టూరు నేతలు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్,ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.