మానవత్వం చాటుకున్న సీరమ్మ... * రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ సహాయం అందించిన సిరమ్మ *
విజయనగరం, సూర్య : ఈరోజు అప్పలంపేట గ్రామంలో ఎన్నికల ప్రచార కార్యక్రమానికి వెళుతున్న కూటమి జెడ్పీటీసీ అభ్యర్థి మజ్జి సిరి సహస్ర (సిరమ్మ) రాజాం నుంచి రామభద్రపురం వెళ్లే మార్గంలోని రాజీపేట జంక్షన్ వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న రోడ్డు ప్రమాదాన్ని గమనించారు.ప్రమాదంలో గాయపడిన వారిని చూసిన వెంటనే స్పందించిన సిరమ్మ క్షతగాత్రులకు తక్షణ సహాయం అందించేందుకు ముందుకొచ్చారు. తన కారును అందుబాటులో ఉంచి, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించేలా ఏర్పాట్లు చేశారు.
ఎన్నికల ప్రచారానికి వెళుతున్న సమయంలో మార్గమధ్యంలో జరిగిన ప్రమాదాన్ని గమనించి, ప్రచారం కంటే బాధితుల ప్రాణాలకు, వైద్య సహాయానికి ప్రాధాన్యతనిస్తూ సిరమ్మ చూపిన చొరవ మానవతా దృక్పథానికి నిదర్శనంగా నిలిచింది.