మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని కలిసిన రాచానుపల్లి సర్పంచ్ ఆంజనేయులు యాదవ్, వైసిపి నాయకులు
అనంతపురము రూరల్ మేజర్ న్యూస్ :
అనంతపురము రూరల్ మండలం రాచానపల్లి గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్‌గా భారీ మెజారిటీ గెలుపొందిన అంజినేయులు యాదవ్ శనివారం వైసీపీ నాయకులు , కార్యకర్తలతో భారీగా వాహనాల్లో తోపుదుర్తికి తరలివెళ్లి .. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డికి పూలమాల వేసి.. శాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలిపారు. భారీ మెజార్టీతో గెలుపొందిన నూతన సర్పంచ్ ఆంజనేయులుయాదవ్,
వార్డు సభ్యులును, గెలుపు కోసం సమిష్టిగా పనిచేసిన రాచాను పల్లి పంచాయతీ వైసిపి నాయకులు, కార్యకర్తలను మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి అభినందించారు. రాచాను పల్లి గ్రామ అభివృద్ధికి నూతన ఎన్నికైన పంచాయతీ పాలకవర్గం, వైసీపీ నాయకులు కార్యకర్తలు అంతా కలిసికట్టుగా గ్రామ అభివృద్ధి కోసం కలిసికట్టుగా, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో రాచానపల్లి గ్రామ పెద్దలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.