లంకవానిదిబ్బ సర్పంచ్‌గా చిలకలపూడి కీర్తి స్రవంతి ఏకగ్రీవ ఎన్నిక అనగాని శివప్రసాద్ మోపిదేవి వెంకటరమణారావు అభినందనలు
రేపల్లె మేజర్ న్యూస్;
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రేపల్లె మండలం లంకవానిదిబ్బ గ్రామ సర్పంచ్‌గా చిలకలపూడి కీర్తి స్రవంతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆమె రేపల్లెలోని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ క్యాంపు కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ రేపల్లె నియోజకవర్గ కోఆర్డినేటర్ అనగాని శివప్రసాద్‌ను మాజీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ రావు ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేసి అభినందించారు.
అనంతరం మాజీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావును ఆయన గృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌గా గ్రామ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావు పాల్గొన్నారు. నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నికైన చిలకలపూడి కీర్తి స్రవంతికి పలువురు నాయకులు, ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు.