లలిత త్రిపురసుందరి దేవి అలంకారంలో ముత్యాలమ్మ అమ్మవారు.
లలిత త్రిపురసుందరి దేవి అలంకారంలో ముత్యాలమ్మ అమ్మవారు.
రొంపిచెర్ల, మేజర్ న్యూస్:
రొంపిచెర్ల గ్రామంలో వెలసిన శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం ఐదవ రోజు ఉదయం అమ్మవారిని లలిత త్రిపురసుందరి దేవి అలంకారంలో సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా జగన్మాత అయిన అమ్మవారు అందరిపై కరుణాకటాక్షాలు కురిపించి, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు ప్రసాదించాలని భక్తులు ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో దసరా ఉత్సవ కమిటీ సభ్యులు అశోక్ కుమార్, వాసు, శ్రీనివాసులు, మురళి, మౌనిష్, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.