కుంతీదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు
యలమంచిలి మేజర్ న్యూస్ :శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం శరత్ ఋతువు శుక్ల పక్షం దశమి పర్వదినం విజయం దశమి సందర్బంగా యలమంచిలి మండలం కొంతేరు గ్రామంలో వేంచేసియున్న శ్రీ కుంతీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం లో ఆలయ తాత్కాలిక అర్చకులు పూలపల్లి వేణునాథ్ ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. సాయంత్రం గ్రామోత్సవం నిర్వహించారు. రాత్రికి దేవస్థానం సిమి పూజ అనంతరం భక్తులకు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్వామి పవలింపు సేవతో ఉత్సవం ముగిసింది. గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.