కొత్తపాలెం సర్పంచ్‌గా డి.వి.ఆర్ సతీమణి నాంచారమ్మ ఏకగ్రీవ ఎన్నిక ... అభినందించిన అనగాని శివప్రసాద్
నిజాంపట్నం, మేజర్ న్యూస్:
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నిజాంపట్నం మండలం కొత్తపాలెం గ్రామ సర్పంచ్‌గా నిజాంపట్నం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దండుప్రోలు వెంకటేశ్వరరావు (డీవీఆర్) సతీమణి నాంచారమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నికైన నాంచారమ్మ, ఆమె భర్త దండుప్రోలు వెంకటేశ్వరరావు (డీవీఆర్) రేపల్లెలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ క్యాంపు కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ కోఆర్డినేటర్ అనగాని శివప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా అనగాని శివప్రసాద్ నాంచారమ్మకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసి అభినందించారు. గ్రామ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. గ్రామంలో మౌలిక వసతుల కల్పన, తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారుల అభివృద్ధి వంటి ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ అందరినీ కలుపుకొని ముందుకు సాగాలని సూచించారు. ఏకగ్రీవ ఎన్నికతో కొత్తపాలెం గ్రామంలో నాంచారమ్మకు బాధ్యతలు అప్పగించిన గ్రామ ప్రజలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు పంతాని సాయికుమార్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.