BREAKING
మై ప్రేమ్ కీ దివానీ హూన్ విషయంలో ఆ ముగ్గురికి అన్యాయం చేశా.. సూరజ్ బర్జాత్యా ఆసక్తికర వ్యాఖ్యలు పంచాయతీ ఎన్నికల్లో శాంతిభద్రతలే ప్రధానం.. సొంట్యాంలో "ప్రజలతో ముఖాముఖి" జీతం ఫుల్.. డ్యూటీ డల్! కిమిడి నాగార్జున ను కలిసిన డిప్యూటీ మేయర్.. నీటి సరఫరా శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి..... ముక్కా శ్రావణి నీ పరామర్శించిన మేయర్ భార్గవి..* ఫోన్ లో ఎమ్మెల్యే అదితి పరామర్శ.... దివ్యాంగ క్రీడాకారుల్లో ప్రతిభను వెలికితీసేందుకు పారాస్పోర్ట్స్ రాష్ట్రస్థాయి ఛాంపియన్‌షిప్ పోటీలు.. 16 వ వార్డు కార్పొరేటర్ ఏడువాక కు అభినందనలు - స్వర్ణ వార్డు సచివాలయ సిబ్బంది వార్తలు ప్రసారం చేస్తే..నోటీసులిస్తారా?... పద్మావత్ షూటింగ్‌లో రణ్‌వీర్ సింగ్‌కు 24 సార్లు చెంపదెబ్బ.. రజా మురాద్ ఆసక్తికర వ్యాఖ్యలు త్రాగునీటి బోరును ప్రారంభించిన కార్పొరేటర్ కాకి గంగరాజు జిల్లా స్థాయి పారా స్పోర్ట్స్ సెలక్షన్ పోటీల్లో 88 మంది క్రీడాకారులు ఎస్ఎస్టి టీం తో కలిసి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ వాహనాల తనిఖీలు. పార్వతీపురం జిల్లాలో ఉద్యోగులకు ఎన్నికల విధులను దూర ప్రాంతాలలో అధికారులు ఇష్టానుసారం వేయడం మానుకోవాలి.......ఎ పి టి ఎఫ్ 1938. 11వ వార్డు లో మోర్ ఎదురుగా ఫుట్ పాత్ పై ఉన్న అమ్ముతున్న కాయగూర లు ప్రజల్లో గుబులు

కోటియ గ్రామాల గిరిజనులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రక్షణ కల్పించాలి

Select Suryaa Now
 కోటియ గ్రామాల గిరిజనులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రక్షణ కల్పించాలి

పాచిపెంట, నవంబర్ 25, మేజర్ న్యూస్: కొటీయా వివాదాస్పద గ్రామాల గిరిజనులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రక్షణ కల్పించాలి అని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోరాడ ఈశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనులు మనోభావాలకు అనుగుణంగా సరిహద్దు సమస్యను పరిష్కారం చేయాలి, ఒడిశా ప్రభుత్వం అరెస్ట్ చేసిన గిరిజనులను వెంటనే విడిచి పెట్టాలని డిమాండ్ చేస్తూ అరెస్టు అయిన గిరిజన కుటుంబాలను కలిసి ధైర్యం చెప్పడం జరిగింది అని తెలిపారు. గిరిజనులు పై ఒడిస్సా ప్రభుత్వం చేస్తున్న దాడులు, దౌర్జన్యాలు చేస్తుంటే అండగా ఉండవలసిన రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పించకుండా, భరోసా ఇవ్వకుండా ఉండడం సరికాదని అన్నారు. భద్రత భరోసా లేకపోవడం వలన గిరిజనులు అభద్రత భావంతో భయంతో బతుకుతున్నారని తెలిపారు. ప్రశ్నిస్తున్న వాళ్లందరినీ ఒడిస్సా ప్రభుత్వం దౌర్జన్యంగా అరెస్టులు చేస్తూ జైల్లో పెడుతుంటే వాళ్ళని విడిపించకుండా ఒడిస్సా ప్రభుత్వంతో చర్చలు జరిపి సమస్య పరిష్కారంకు కృషి చేయకుండా ఉన్నారని తెలిపారు. ఇప్పటికైనా అరెస్టు అయిన గిరిజనులు అందరిని వెంటనే విడిచి పెట్టాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ వేసిన వారందరినీ విత్డ్రా చేసుకోవాలని లేకపోతే విడిచి పెట్టమని ఒడిస్సా ప్రభుత్వం బెదిరింపులకు దిగుతుందని, ఈనెల 27వ తేదీన ఒడిస్సా కోర్టుకు హాజరుకావాలని గిరిజనులు ఇళ్లకు నోటీసులు అంటించి వెళ్లడం గిరిజనులను బెదిరించడం సరికాదని తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఇరువు రాష్ట్రాల మధ్య చర్చలు ఏర్పాటు చేసి గిరిజనులు మనోభావాలకు అనుగుణంగా చేయాలని డిమాండ్ చేశారు. ఒడిస్సా ప్రభుత్వం గిరిజనులపై చేస్తున్న దౌర్జన్యాలను ఆపాలని, లేనియెడల గిరిజనులందరూ సంఘటితమై తిరగబడతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక గిరిజనులు పాల్గొన్నారు.