కోటి 20 లక్షలతో రహదారి నిర్మాణానికి భూమి పూజ చేసిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి.
పల్లెలకు పక్కా రోడ్లు.. ప్రగతికి వేగవంతమైన అడుగులు.
గ్రామీణ రహదారులు బాగుంటే దేశ భవిష్యత్తు బాగుంటుంది.
పథకమూరు పాపిరెడ్డి పాలెం రోడ్డుకు మహర్దశ
కోటి 20 లక్షల రూపాయలతో రహదారి నిర్మాణానికి భూమి పూజ చేసిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి.
సూర్య న్యూస్ దర్శి.
గ్రామాల రోడ్లు బాగుంటే ప్రగతి వేగవంతంగా ఉంటుందని, మంచి రోడ్లు ప్రగతికి సోపానమని అభివృద్ధికి సరైన మార్గమని నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. గ్రామీణ ప్రాంత రహదారుల అభివృద్ధి కూటమి ప్రభుత్వ ధ్యేయం అని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ అన్నారు .సోమవారం . 1కోటి 20 లక్షల రూపాయలతో పోతకమూరు - పాపిరెడ్డి పాలెం రహదారికి భూమి పూజ చేసి పనులు ను డాక్టర్ లక్ష్మి ప్రారంభించారు.
ఈ కార్యక్రమం లో టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ , దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, దర్శి ఏఎంసి చైర్మన్ దారం నాగవేణి - సుబ్బారావు, దర్శి మండల టిడిపి అధ్యక్షులు మారెళ్ల వెంకటేశ్వర్లు, దర్శి మున్సిపల్ వైస్ చైర్మన్ తలారి కోటయ్య, ఆకుల వెంకట్రావు, బోట్ల కోటేశ్వరావు, బొట్ల సుబ్బారావు, మార్తుల ఎలమందరెడ్డి వెన్నపూస సుబ్బారెడ్డి లక్కు వెంకటేశ్వర రెడ్డి, గంగిరెడ్డి నాగిరెడ్డి, అచ్చిరెడ్డి మండలం లోని వివిధ హోదాల్లో ఉన్న టిడిపి నాయకులు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.