BREAKING
క్యాన్సర్ పై అవగాహన... ఉచిత వైద్య శిబిరం రెచ్చిపోయిన కెమికల్ కంపెనీల మాఫియా! *నాగార్జునసాగర్ లో-లెవల్ కాలువలో ప్రమాదకర రసాయన వ్యర్థాల పారబోత పెరవలి మండలంలో బ్రిక్స్ వారోత్సవాలు ప్రారంభం కంభంపాడు ఎస్సీ కాలనీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటి ప్రచారం న్యూజిలాండ్‌తో తొలి వన్డే: ఆక్లాండ్ మైదానంలో టీమిండియాను వణికిస్తున్న పాత రికార్డులు! రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో ఉమ్మడి తూర్పుగోదావరి జట్టుకు రన్నరప్ స్థానం ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం మానవతా సేవకు ముందడుగు! భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్-2026 ప్రారంభం చెరువుగట్టు శివాలయం లో కార్తీక మాస ఉత్సవాలకు ఏర్పాట్లు ప్రపంచవ్యాప్తంగా మాంద్య భయాలను రేకెత్తిస్తున్న టెక్ విక్రయాలు! ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ రేసులో తిలక్ వర్మ: సంచలన వ్యాఖ్యలు చేసిన కృష్ణమాచారి శ్రీకాంత్! నారాయణపురం కి సబ్ రేషన్ షాపు ఏర్పాటుకు *ఆర్డీవో రమణారెడ్డి సానుకూల స్పందన దక్షిణ ఆఫ్రికాలో దూసుకెళ్తున్న ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు నాగార్జున ‘కింగ్ 100’ నుంచి టబు స్పెషల్ గ్లింప్స్: పుట్టినరోజు కానుకగా రానున్న అద్భుతమైన అప్‌డేట్!

కూటమిప్రభుత్వంలోనే బీసీలకు న్యాయం ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు

Select Suryaa Now
కూటమిప్రభుత్వంలోనే బీసీలకు న్యాయం ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు

నరసరావుపేట న్యూస్ :రాష్ట్రంలోకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో బీసీ వర్గాలకు పూర్తి భరోసా సామాజిక న్యాయం లభిస్తోందని శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు పేర్కొన్నారు. టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వహయాంలో బీసీలపై తీవ్ర స్థాయిలో దాడులు, అణచివేత జరిగాయని మండిపడ్డారు. ఐదేళ్ల కాలంలో దాదాపు 30 వేల మంది బీసీలపై అక్రమ కేసులు బనాయించారని, 3 వేల మందిని అక్రమంగా జైళ్లకు పంపారని, ఏకంగా 300 మంది బీసీ నాయకులను హత్య చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు దక్కకుండా కోర్టులకు వెళ్లి అడ్డంకులు సృష్టించారని ఆరోపించారు. వైకాపా పాలనలో జరిగిన అన్యాయాలను దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం బీసీల సంక్షేమం కోసం ఎస్సీ, ఎస్టీ చట్టం తరహాలోనే పటిష్టమైన ‘బీసీ రక్షణ చట్టాన్ని’అమలులోకి తెచ్చిందని తెలిపారు. బీసీలపై అనుచిత వ్యాఖ్యలు చేసినా, దాడులకు పాల్పడినా చట్టప్రకారం కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఎన్టీ రామారావు నాటి నుంచే బీసీలు తెలుగుదేశం పార్టీకి వెన్నెముకగా ఉన్నారని గుర్తుచేశారు. ప్రభుత్వం కేబినెట్‌లో నిర్ణయం తీసుకునిస్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తోందని, దీనిద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 18 వేల మంది బీసీలకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కుతోందని తెలిపారు. నరసరావుపేట మున్సిపాలిటీలోని 48 కౌన్సిలర్ స్థానాల్లో దాదాపు 19 స్థానాలను (సుమారు 40%) బీసీలకే కేటాయించామని వివరించారు. బీసీల హక్కుల కోసం పోరాడిన బీసీ సంక్షేమ సంఘ నాయకులు కేసన శంకరరావు కృషిని అభినందిస్తూ, బీసీలకు అన్నివిధాలా అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ లకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రఅధికార ప్రతినిధి ఏపీ బీసీ సంక్షేమ సంఘం బాదుగున్నల శ్రీను, మడక శివప్రసాద్, జిల్లా మహిళా అధ్యక్షురాలు కదం నాగ జ్యోతి మరియు బిసి సంక్షేమ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.