.కూటమి నేతల కీలక సమీక్ష... స్థానిక ఎన్నికలపై వ్యూహరచన..
బి.కొత్తకోట మండలంలోని హార్సిలీ హిల్స్ లోని ఒక ప్రైవేట్ రిసార్ట్లో స్థానిక సంస్థల ఎన్నికలపై కూటమి నాయకుల ముఖ్య సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్చార్జ్ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి, మదనపల్లె ఎమ్మెల్యే ఎం.షాజహాన్ బాషా, టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ దామచర్ల సత్య, పలమనేరు ఎమ్మెల్యే ఎన్. అమర్నాథ్ రెడ్డి, తంబళ్లపల్లె నియోజకవర్గం టిడిపి ఇంచార్జి మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్, పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ వై. మధుసూదన్ నాయుడు, జనసేన నాయకురాలు దారం అనిత, బిజెపి సీనియర్ నాయకులు చల్లపల్లి నరసింహారెడ్డి మరియు జిల్లా స్థాయి కూటమి నాయకులు పాల్గొన్నారు.ఈ భేటీలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు కూటమి శ్రేణులను సమాయత్తం చేయడం, గ్రామాలు, మండలాల వారీగా నెలకొన్న రాజకీయ పరిస్థితులపై లోతైన సమీక్ష జరిగింది. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, కూటమి పార్టీల మధ్య సమన్వయంతో ముందుకు సాగాల్సిన ఆవశ్యకతపై చర్చించారు.కూటమి ఐక్యతే లక్ష్యంగా, విజయమే ధ్యేయంగా ముందుకు సాగాలని ఈ సందర్భంగా నేతలు పిలుపునిచ్చారు.
పి గౌరీ శంకర్ స్టాప్ రిపోర్టర్ తంబళ్లపల్లె