BREAKING
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి విజయదశమి వేళ రాజరాజేశ్వరీ దేవిగా దుర్గమ్మ దర్శనం విజయవాడలో కూటమి సమష్టి కార్యాచరణ.. - అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ గెలుపునకు ప్రత్యేక వ్యూహం మహర్నవమి వేడుకల్లో ఆయుధ పూజలు.. - పోలీస్‌ కమిషనర్‌ దంపతుల ప్రత్యేక పూజలు 76వ డివిజన్‌లో గాదిరాజు శ్రీనివాసరాజుకు మద్దతుగా బొండా ఉమా ప్రచారం కృష్ణా జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నగారా ఉయ్యూరు అభివృద్ధే లక్ష్యం.. ప్రజా సంక్షేమమే ధ్యేయం మచిలీపట్నం అభివృద్ధే నా ధ్యేయం : కూటమి మేయర్ అభ్యర్థి షేక్ అబ్దుల్ అబీదా స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి స్థానిక ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ దసరా మెగా కార్నివాల్‌.. విజయవాడలో ట్రాఫిక్‌ మళ్లింపులు విజయవాడ ఉత్సవ్ 2.0లో ‘క్యాస్ట్’ చిత్ర బృందం సందడి నేటి పంచాంగం 20 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –20 అక్టోబర్ 2026 శ్రీవారి అలంకరణలో కదిరి నరసింహ స్వామి

కూటమి అభ్యర్థుల గెలుపుతో క్షేత్రస్థాయి అభివృద్ధి: మంత్రి కందుల దుర్గేష్

Select Suryaa Now
కూటమి అభ్యర్థుల గెలుపుతో క్షేత్రస్థాయి అభివృద్ధి: మంత్రి కందుల దుర్గేష్

నిడదవోలు:నిడదవోలు మున్సిపాలిటీ ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపి కూటమి చైర్‌పర్సన్ అభ్యర్థిగా మురల జ్యోతి ఆదివారం మున్సిపల్ ఆఫీస్‌లో రిటర్నింగ్ ఆఫీసర్‌కు నామినేషన్ పత్రాలను అందజేశారు. రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది. అంతకుముందు 'ఐ లవ్ నిడదవోలు' సెంటర్ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు కూటమి నాయకులు, శ్రేణులతో భారీ ర్యాలీ నిర్వహించారు. నిబంధనల ప్రకారం నామినేషన్ దాఖలు సమయంలో అభ్యర్థులతో పాటు ఇద్దరు ప్రతినిధులు మాత్రమే లోపలికి వెళ్లారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మీడియాతో మాట్లాడుతూ.. మూడు పార్టీల ఏకాభిప్రాయంతో నిడదవోలులోని 32 వార్డుల్లోనూ కూటమి తరఫున అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. కౌన్సిలర్లతో పాటు చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ స్థానాల్లో కూటమి విజయం సాధించడమే లక్ష్యంగా స్పష్టమైన ప్రణాళికతో ఎన్నికల ప్రచారంలోకి వెళ్తున్నాం.
స్థానిక సంస్థల ఎన్నికలకు కూటమి ముందే సంపూర్ణ సన్నాహాలతో ఉందనే స్పష్టమైన సంకేతం ప్రజల్లోకి వెళ్లింది. నేటి నుండే పూర్తిస్థాయి ఎన్నికల ప్రచారంలోకి వెళ్తున్నాం.


నిడదవోలు నియోజకవర్గంలో గడిచిన రెండేళ్ల కాలంలోనే దాదాపు రూ. 600 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టి, పట్టణ రూపురేఖలను మార్చివేశాం.కేవలం ఈ రెండేళ్లలోనే నిడదవోలు రూపురేఖలు మారుతున్నాయని ప్రజలే స్పష్టం చేస్తున్నారు.. రెండేళ్ల క్రితం ఉన్న పరిస్థితులకు, ఇప్పటి మార్పునకు వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలి. రాబోయే మూడు నెలల్లో ఆర్‌ఓబీ నిర్మాణాన్ని పూర్తి చేస్తాం. దశాబ్దాలుగా ఉన్న ప్రధాన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తాం. పట్టణంలో రహదారులు, డ్రైన్ల నిర్మాణం,  పట్టణ సుందరీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో నిడదవోలు బస్టాండును ఆధునికీకరించి, పట్టణాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తాం. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలు క్షేత్రస్థాయికి చేరాలంటే స్థానిక సంస్థల్లో కూటమి విజయం అత్యంత ఆవశ్యకం.కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే మరిన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తాం. కూటమి తరఫున పోటీ చేస్తున్న చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్, కౌన్సిలర్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించి, నిడదవోలు పట్టణాభివృద్ధికి సహకరించాలని మంత్రి దుర్గేష్ ఈ సందర్భంగా ప్రజలను కోరారు.