BREAKING
భారత్‌ ఖాతాలో 18వ పసిడి, 78 పతకాలతో 5వ స్థానంలో టీమిండియా రాప్తాడు పీహెచ్‌సీకి జిల్లా స్థాయి స్వచ్ఛ అవార్డు స్వచ్ఛ ఆసుపత్రి అవార్డు అందుకున్న సిబ్బంది ఏషియా కప్ ఫైనల్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. బస్సులు సమయానికి నడపాలంటూ విద్యార్థుల ధర్నా ఏపీ లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్‌కు సిట్ నోటీసులు! శ్రీ సిటీలో టిల్ హెల్త్ కేర్ కంపెనీలో పేలుడు భారీ ప్రాణ నష్టం జరిగినట్లు అంచనా కన్యకాపరమేశ్వరి శరన్నవరాత్రి ఉత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం గాంధీ మార్గం అనుసరణీయం సరిహద్దుల్లో అవినీతి, వీసా అక్రమాలపై దక్షిణాఫ్రికా ఉక్కుపాదం: సంయుక్త దర్యాప్తు సంస్థల రంగప్రవేశం! గాంధీ జయంతి సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నివాళులు మృతురాలి కుటుంబానికి చికెన్ శీనా యాదవ్ ఆర్థిక సాయం గజపతినగరంలో ఉచిత వైద్య శిబిరం విజయవంతం… అలాస్కా ఎల్‌ఎన్‌జీ ప్రాజెక్టుపై ట్రంప్ సంచలన హెచ్చరిక: పెట్టుబడులు పెట్టకపోతే దక్షిణ కొరియాపై 'డబుల్ ఛార్జ్' వేస్తామని అల్టిమేటం! వికారాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం, భర్తతో గొడవపడి ఇద్దరు పిల్లలతో కలిసి బావిలో దూకి తల్లి ఆత్మహత్య బీసీ రిజర్వేషన్లపై నేడు సుప్రీం కోర్టుకు..

కె ఎల్ యు యూనివర్సిటీ లైబ్రరీలో ఘోర అగ్నిప్రమాదం: తగలబడిన పుస్తకాలు, ఫర్నిచర్

Select Suryaa Now
కె ఎల్ యు యూనివర్సిటీ లైబ్రరీలో ఘోర అగ్నిప్రమాదం: తగలబడిన పుస్తకాలు, ఫర్నిచర్

విజయవాడ, సూర్య ప్రతినిధి :నగర సమీపంలోని ప్రముఖ కేఎల్‌యూ (KLU) యూనివర్సిటీ లైబ్రరీ భవనంలో శుక్రవారం అకస్మాత్తుగా పేలుడు సంభవించి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పేలుడు ధాటికి గ్రంథాలయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో తీవ్ర కలకలం రేగింది. ప్రమాద సమయంలో అక్కడ ఉన్న విద్యార్థులు, సిబ్బంది తీవ్ర భయాందోళనలకు గురై ప్రాణాలు దక్కించుకోవడానికి బయటకు పరుగులు తీశారు.

ఈ ప్రమాదంలో లైబ్రరీలోని భారీ మొత్తంలో పుస్తకాలు, కంప్యూటర్లు మరియు ఫర్నిచర్ దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమించారు. ఘటనా సమయంలో అప్రమత్తమై విద్యార్థులందరూ సురక్షితంగా బయటకు రావడంతో ఎవరికీ ఎటువంటి ప్రాణాపాయం జరగలేదని విశ్వవిద్యాలయ యాజమాన్యం ప్రకటించింది. కాగా, షార్ట్ సర్క్యూట్ కారణంగానే పేలుడు జరిగి మంటలు వ్యాపించి ఉంటాయని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.