గజపతినగరంలో ఉచిత వైద్య శిబిరం విజయవంతం…
గజపతి నగరం అక్టోబర్ 2 మేజర్ న్యూస్
కర్రి సీతారాం జ్ఞాపకార్థం శ్రీ రామదూత యువజన సంఘం కమిటీ ఆధ్వర్యంలో విజయనగరానికి చెందిన సాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక దిగువ వీధిలో శుక్రవారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం విజయవంతమైంది. సుమారు 250 మంది రోగులు ఈ శిబిరంలో పాల్గొనగా వైద్యులు డాక్టర్ అక్కిన శ్రీరామ్మూర్తి, డాక్టర్ కలపర్తి మాధురి సుధా డాక్టర్ మాధురి దేవి డాక్టర్ సుప్రజ రోగులను పరీక్షించి ఉచితంగా మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కందుల వెంకట చిన్నయ్య స్వామి, వైస్ సర్పంచ్ కర్రి రామునాయుడు, మాజీ ఎంపిటిసి ఆల్తి రామనాయుడు, సంగిరెడ్డి మహేష్ పలువురు నాయకులు పాల్గొన్నారు.