రాప్తాడు పీహెచ్‌సీకి జిల్లా స్థాయి స్వచ్ఛ అవార్డు స్వచ్ఛ ఆసుపత్రి అవార్డు అందుకున్న సిబ్బంది
రాప్తాడు పీహెచ్‌సీకి జిల్లా స్థాయి స్వచ్ఛ అవార్డు
స్వచ్ఛ ఆసుపత్రి అవార్డు అందుకున్న సిబ్బంది
రాప్తాడు మేజర్ న్యూస్:
స్వచ్ఛాంధ్ర–స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర అవార్డుల్లో రాప్తాడు ప్రభుత్వ పీహెచ్‌సీకి జిల్లా స్థాయి అవార్డు లభించింది. స్వచ్ఛ ఆసుపత్రి కేటగిరీలో ఎంపికైన పీహెచ్‌సీకి అవార్డును వైద్యాధికారి డాక్టర్ శివకృష్ణ అందుకున్నారు.
అనంతపురం జిల్లా కేంద్రంలోని ఏపీడీటీ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా స్థాయిలో అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రాప్తాడు పీహెచ్‌సీ తరఫున డాక్టర్ శివకృష్ణతో పాటు సిబ్బంది అవార్డును స్వీకరించారు.
పీహెచ్‌సీలో పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణ, పారిశుద్ధ్య చర్యలు, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు. అవార్డు రావడం పట్ల పీహెచ్‌సీ సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.