కన్యకాపరమేశ్వరి శరన్నవరాత్రి ఉత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం
ప్రొద్దుటూరు అర్బన్ మేజర్ న్యూస్:
దసరా పర్వదినాలను పురస్కరించుకుని ప్రొద్దుటూరులో నిర్వహించనున్న శ్రీ మత్కన్యకాపరమేశ్వరి దేవి శరన్నవరాత్ర మహోత్సవాలకు స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డిని ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు ఆహ్వానించారు.
ఈ మేరకు శనివారం ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డిని ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి ఉత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అలంకరణలు, భక్తి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వారు ఎమ్మెల్యేకు వివరించారు. ఈ సందర్భంగా ఉత్సవాల్లో ఎమ్మెల్యే పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకోవాలని ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు కోరారు. దసరా సందర్భంగా నిర్వహించే ఈ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బుశెట్టి రాంమోహన్‌రావు, ఉపాధ్యక్షులు జొన్నలగడ్డ రవి తదితరులు పాల్గొన్నారు.