సిఎం, డిప్యూటీ సీఎంల పర్యటనకు ఏర్పాట్లు, హెలిప్యాడ్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి
ప్రొద్దుటూరు మేజర్ న్యూస్:
కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణానికి ఈ నెల 5వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రానున్నారు.. వీరి రాకతో ప్రొద్దుటూరు పట్టణంలో పచ్చదనం ఉట్టిపడుతుండగా, కూటమి నాయకులు, తెలుగుదేశం, జనసేన, బిజపి శ్రేణులు తీవ్ర ఉత్సాహంతో ఊగిపోతున్నారు.. నాయకుల పర్యటన సందర్భంగా ఇక్కడ నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి..
ముమ్మరంగా
హెలిప్యాడ్ పనులు..
విఐపీల పర్యటనకు ఎలాంటి భంగం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత స్థానిక శాసనసభ్యునిపై ఉండటంతో, సీనియర్ నాయకులు, స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి శనివారం ఉదయమే రంగంలోకి దిగారు.. సీఎం, డిప్యూటీ సీఎంల భద్రత మరియు యోగక్షేమాలను దృష్టిలో ఉంచుకుని, వారి కోసం ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్ ప్రదేశాన్ని ఆయన వ్యక్తిగతంగా పరిశీలించారు.. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వచ్చి దిగే సమయానికి హెలిప్యాడ్ నిర్మాణ పనులన్నీ సంపూర్ణంగా, ఎలాంటి లోటుపాట్లు లేకుండా పూర్తికావాలని అధికారులను, నిర్వాహకులను ఆదేశించారు..
సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు..
హెలిప్యాడ్ నిర్మాణంలో నిమగ్నమైన కార్మికులు, నిర్వాహకులతో మాట్లాడిన ఎమ్మెల్యే, పనుల్లో అత్యున్నత ప్రమాణాలు పాటించాలని స్పష్టం చేశారు.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పనులు అత్యంత జాగ్రత్తగా పూర్తి చేయాలని, లేకపోతే సహించేది లేదని కఠినంగా హెచ్చరించారు.. ఈ పర్యటనను విజయవంతం చేసేందుకు కూటమి నాయకులు, యంత్రాంగం రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు..