BREAKING
శ్రీసిటీలో ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి గువాహటి నైట్‌క్లబ్‌లో మహిళపై దాడి ఘటన, వైరల్ వీడియోలతో కలకలం, స్వయంగా కేసు నమోదు చేసిన పోలీసులు పూడూర్‌లో వాటర్ ట్యాంకర్ రెండు టైర్లు చోరీ చేవెళ్లలో 11 నుంచి దసరా నవరాత్రి ఉత్సవాలు రామేశ్వరం విమానాశ్రయానికి కేంద్రం అనుమతి కోరనున్న తమిళనాడు ప్రభుత్వం వెయిట్‌లిఫ్టింగ్‌లో ప్రతిభ చాటిన క్రీడాకారులకు సిరమ్మ అభినందనలు ఆత్మహత్య చేసుకున్న రైతు సీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై ప్రతిపక్షాల నిరసనలు, తప్పుదారి పట్టించే ప్రచారమంటూ బెంగాల్, బీహార్ బీజేపీ నేతల విమర్శలు నేడు సతివాడ మోడల్ స్కూల్‌లో ఎస్ఎంసి ఎన్నిక * టీడీపీ వర్సెస్ జనసేన * చైర్మన్ పదవి దక్కేది ఎవరికి? ఉందానగర్ స్టేషన్ వద్ద చెత్త రాజ్యం..! గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలపై గాంధీభవన్‌లో కాంగ్రెస్ కీలక భేటీ అంతర్జాతీయ డేటా కేంద్రంగా భారత్: గ్లోబల్ ఇన్వెస్టర్లకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పిలుపు! స్థానిక సంస్థల ఎన్నికలపై పవన్ కళ్యాణ్ కసరత్తు: నేడు కోఆర్డినేషన్ కమిటీలతో కీలక సమావేశం రోబోటిక్ సర్జరీ రంగంలో భారత్ త్వరలోనే ప్రపంచ అగ్రగామి: కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ధీమా! సిఎం, డిప్యూటీ సీఎంల పర్యటనకు ఏర్పాట్లు, హెలిప్యాడ్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి

బస్సులు సమయానికి నడపాలంటూ విద్యార్థుల ధర్నా

Select Suryaa Now
బస్సులు సమయానికి నడపాలంటూ విద్యార్థుల ధర్నా

వికారాబాద్‌ బస్‌స్టేషన్‌, డిపో ఎదుట రెండు గంటల పాటు ఆందోళన
వికారాబాద్‌, మేజర్ న్యూస్ (అక్టోబర్ 03):: బస్సులు సమయానికి నడపడం లేదంటూ విద్యార్థులు వికారాబాద్‌ బస్‌స్టేషన్‌, ఆర్టీసీ డిపో ఎదుట ధర్నాకు దిగారు. శనివారం విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఆందోళనలో పాల్గొని ఆర్టీసీ అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.గ్రామీణ ప్రాంతాల నుంచి వికారాబాద్‌కు విద్య కోసం వచ్చే విద్యార్థులకు బస్సుల కొరత, సమయపాలన లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు తెలిపారు. నిర్ణీత సమయానికి బస్సులు రాకపోవడంతో పాఠశాలలు, కళాశాలలకు ఆలస్యంగా చేరుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఉదయం వేళల్లో విద్యార్థుల రద్దీకి అనుగుణంగా బస్సులు అందుబాటులో ఉండటం లేదని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో విద్యార్థులు బస్‌స్టేషన్‌ వద్ద నుంచి డిపో వరకు ఆందోళన చేపట్టి, బస్సులను క్రమబద్ధంగా నడపాలని డిమాండ్‌ చేశారు. సుమారు రెండు గంటల పాటు కొనసాగిన ధర్నాతో బస్‌స్టేషన్‌ పరిసరాల్లో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.విద్యార్థుల సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించి, విద్యార్థుల రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులు ఏర్పాటు చేయడంతో పాటు సమయపాలన పాటించాలని వారు కోరారు.