మృతురాలి కుటుంబానికి చికెన్ శీనా యాదవ్ ఆర్థిక సాయం
అనంతపురం బ్యూరో : గుత్తి పట్టణంలోని 22వ వార్డుకు చెందిన టీడీపీ నాయకుడు, స్టోర్ డీలర్ ఈరన్న గౌడ్ సోదరి ఉరుకుందమ్మ మృతి చెందడంతో, ఆమె కుటుంబాన్ని ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు చికెన్ శీనా యాదవ్, పట్టణ అధ్యక్షుడు ఎం.కె. చౌదరి పరామర్శించి నివాళులర్పించారు. ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, యువనేత గుమ్మనూరు ఈశ్వర్ స్ఫూర్తితో చికెన్ శీనా యాదవ్ రూ.5,000 ఆర్థిక సాయం అందించారు.
బాధిత కుటుంబానికి టీడీపీ, గుమ్మనూరు కుటుంబం ఎల్లవేళలా అండగా ఉంటాయని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సుంకన్న యాదవ్, చెరుకూరి లక్ష్మణ్ చౌదరి, బూత్ ఇన్‌చార్జి దాదు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.