కౌంటింగ్ కేంద్రం వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు
రాజాం, సూర్య : రాజాంలో స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసు శాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ఈ ఏర్పాట్లను బీఎస్పీ బివి రాఘవులు స్వయంగా పర్యవేక్షించారు.సీఐలు డి నవీన్ కుమార్,హెచ్ ఉపేందర్ రావు ఆధ్వర్యంలో కౌంటింగ్ కేంద్రం పరిసరాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.నాలుగు మండలాలకు చెందిన ఎస్‌ఐలు,పోలీసు సిబ్బంది ఈ బందోబస్తు విధుల్లో పాల్గొన్నారు.కౌంటింగ్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా, ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించేలా పోలీసు అధికారులు భద్రతా చర్యలు చేపట్టారు.