కనిగిరి సిడిపిఓ సరోజని సస్పెండ్
కనిగిరి ,మేజర్ న్యూస్ :
కనిగిరి ఐసిడిఎస్ సిడిపిఓ పి సరోజని నీ సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు .కనిగిరి ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని కనిగిరి పట్టణంలో అంగన్వాడీ కేంద్రాల పనితీరుపై ఉన్నతాధికారులకు పిర్యాదులు అందాయి .ఇటీవల ఫుడ్ కమీషన్ చైర్మన్ కనిగిరి పట్టణంలోని పలు అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు .తనిఖీలో అంగన్వాడీ కేంద్రాలలో రికార్డులు పరిశీలించి పనితీరు అద్వాన్నంగా ఉండడంతో ఇటీవల సూపర్ వైజర్ ను సస్పెండ్ చేయగా ,ఒక అంగన్వాడీ కార్యకర్త ,ఆయాను విధుల నుండి తొలగించారు .ఇటీవల ప్రాజెక్టు కార్యాలయం లో రికార్డులు చోరీ ,కేంద్రాల పనితీరు సోషల్ మీడియాలో హాల్చల్ చేయడం విమర్శలకు తావిచ్చింది .కనిగిరి ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం ,కేంద్రాల పర్యవేక్షణ లోపంపై సిడిపిఓ ను సస్పెండ్ చేయడం జరిగింది .