BREAKING
చెత్తను సద్వినియోగం చేసుకోవాలి ఆశావర్కర్స్కు కనీసవేతనాలు చెల్లించాలి. అయోడిన్ లోప రుగ్మతల నియంత్రణకు జిల్లా స్థాయి సర్వే.. ఎముకల ఆరోగ్యం: వయసు పెరుగుతున్న కొద్దీ ఎముకలు దృఢంగా ఉండాలంటే రోజూ ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ప్రొటీన్ లోపం రాకుండా ఉండాలంటే రోజువారీ మన శరీరానికి ఎంత ప్రొటీన్ అవసరమో తెలుసా? ఐరన్ లోపం: శరీరంలో హిమోగ్లోబిన్ తగ్గి అలసట, తల తిరగడానికి అసలు కారణం ఏమిటో తెలుసా? కరీనా షోలో షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్‌‌పుత్.. ఆ యాడ్ వివాదంపై కృతి సనన్ షాకింగ్ కామెంట్స్! లక్ష్మీపోలవరంలో అంగన్వాడీ ఉత్సవ్ ప్రజలకు శుభ్రమైన తాగునీరు అందేలా చర్యలు విదేశాలకు వెళ్లే ముందు పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలి.. జిల్లా కలెక్టర్ డా. మహేష్ కుమార్ లో బ్రిడ్జి వద్ద వర్షపు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దసరాకు రాష్ట్రపతి రాక సమగ్ర శిశు అభివృద్ధి సేవలను మరింత బలోపేతం చేయాలి.. : జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ పోలవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం.ఏడు మండలాల తహసీల్దార్లతో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సమీక్ష ప్రజా సమస్యలపై వెలంపల్లి పోరాటాన్ని అడ్డుకోవద్దు : వైసీపీ మాజీ కార్పొరేటర్ల హెచ్చరిక

కనకమహాలక్ష్మి దేవస్థానంలో ఎన్‌ఎంఆర్ మహిళా ఉద్యోగులకు పర్మినెంట్?

Select Suryaa Now
కనకమహాలక్ష్మి దేవస్థానంలో ఎన్‌ఎంఆర్ మహిళా ఉద్యోగులకు పర్మినెంట్?

 

ఏళ్ల తరబడి రోజువారీ వేతనంపై సేవలు.. ప్రచారంతో ఉద్యోగుల్లో కొత్త ఆశలు

విశాఖపట్నం, శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ఏళ్ల తరబడి ఎన్‌ఎంఆర్‌గా పనిచేస్తున్న మహిళా ఉద్యోగులను పర్మినెంట్ చేస్తారన్న ప్రచారం ఉద్యోగ వర్గాల్లో జోరుగా సాగుతోంది. గర్భగుడి, అన్నదాన భవనం, తయారీ విభాగాల్లో 20 మందికి పైగా మహిళలు రోజువారీ వేతనంపై విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. వీరిలో కొందరు 18 ఏళ్లకు పైగా సేవలందిస్తున్నట్లు ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి.ఇటీవల ఎన్‌ఎంఆర్ మహిళా ఉద్యోగుల వ్యవహారంలో ఏఈఓ స్థాయి అధికారిపై ఉద్యోగ వేధింపులు, అనుచిత ప్రవర్తనకు సంబంధించిన ఆరోపణలు రావడం చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంపై ఉద్యోగ సంఘాలు, రిటైర్డ్ ఉద్యోగులు చైర్మన్ కందుల నాగరాజు సమక్షంలో అధికారులను ప్రశ్నించినట్లు సమాచారం. దీనికి సంబంధించిన వీడియోలు ఉద్యోగుల వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అయినట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో మహిళా ఎన్‌ఎంఆర్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తారన్న ప్రచారం మరింత ఊపందుకుంది. ఉద్యోగుల నుంచి మెడికల్ రిపోర్టులు కోరినట్లు కూడా చర్చ జరుగుతోంది. అయితే దీనిపై దేవస్థానం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.మహిళలకు పర్మినెంట్ గుర్తింపు కల్పిస్తే, ఏళ్ల తరబడి రోజువారీ వేతనంపై పనిచేస్తున్న సుమారు 30 మంది పురుష ఎన్‌ఎంఆర్ ఉద్యోగులకు కూడా ఇదే అవకాశం కల్పించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. రోజువారీ వేతన ఉద్యోగుల పర్మినెంట్‌కు ప్రభుత్వం కొత్తగా ఏదైనా జీవో విడుదల చేసిందా? అన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.పర్మినెంట్ ఉద్యోగాలపై ప్రచారం నిజమా? ప్రభుత్వం నుంచి ప్రత్యేక ఉత్తర్వులు ఉన్నాయా? అన్నదానిపై అధికారిక స్పష్టత రావాల్సి