BREAKING
రాజుపేట పాములేరు వంతెన వద్ద డైవర్షన్ రహదారి పనులకు శ్రీకారం స్వామి పుష్కరిణి: సర్వతీర్థాల సంగమం, సకల అభీష్టాల ప్రదాయిని శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం. లోక కళ్యాణమే లక్ష్యంగా మల్లేశ్వరునికి అభిషేకం పెద్దింటి అమ్మవారి సన్నిధిలో వరుణ్ యోగం శ్రీ భీమేశ్వర స్వామిని దర్శించుకున్న మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జనాల చెవులలో పువ్వులు పెట్టొద్దు చెవిరెడ్డి. సిమెంట్ బెంచీలు బహుకరణ కోయ, గోండు వర్క్‌షాప్‌లో పాల్గొన్న తాటి పీఎం సూర్య షూర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ వెల్లడి ఎన్నికల వ్యవస్థను బ్రష్టు పట్టింది బిజెపి పాఠశాల, కళాశాల బస్సుల్లో రహదారి భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి ఆర్టీఓ రంగనాయకులు రైతు బజార్ అక్రమ వసూళ్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలి కాంగ్రెస్ డిమాండ్ 4,563 మొబైల్ ఫోన్లను రికవరీ చేయగా, వాటి విలువ సుమారు రూ.11.40 కోట్లు. రికవరీ రికవరీ పంట పొలాలను పరిశీలించిన వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తల బృందం

కాంట్రాక్టు ఉద్యోగుల నిరవధిక ధర్నా

Select Suryaa Now
కాంట్రాక్టు ఉద్యోగుల నిరవధిక ధర్నా

బాపట్ల, మేజర్ న్యూస్ 

తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించే వరకు నిరవధిక ధర్నా కొనసాగిస్తామని ఆరోగ్యశాఖ కాంట్రాక్టు ఉద్యోగుల జేఏసీ సభ్యుడు కోరపాటి సత్యంరాజు తెలిపారు. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు మంగళవారం బాపట్ల అమరజీవి పొట్టి శ్రీరాములు ఏరియా వైద్యశాల వద్ద కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు నిరసన చేపట్టారు. గత 30 రోజులుగా భోజన విరామ సమయంలో శాంతియుతంగా నిరసనలు చేపట్టినా ప్రభుత్వం స్పందించకపోవడంతో నిరవధిక ధర్నాకు దిగినట్లు సత్యంరాజు తెలిపారు. కరోనా సమయంలో ట్రూనాట్‌, ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు, స్వాబ్‌ సేకరణ వంటి సేవలను అందించామని గుర్తుచేశారు. ఉద్యోగులను రెగ్యులర్‌ చేయడంతో పాటు 100 శాతం గ్రాస్‌ పే, ఉద్యోగి మరణిస్తే రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా, బదిలీ సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. డిమాండ్లు పరిష్కరించే వరకు నిరసనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.