BREAKING
సల్మాన్ ఖాన్ ‘మాతృభూమి’ సినిమా విడుదలకు అడ్డంకులు తొలగిపోయాక కీలక మార్పులు! దసరా నవరాత్రి ఉత్సవాలకు సిద్ధమైన అమ్మవారి ఆలయం లక్ష్మక్కపల్లి చెక్‌డ్యామ్‌పై అధికారుల పరిశీలన ఎం.ఎస్. సుబ్బలక్ష్మి ఐకానిక్ ‘ఎంఎస్ బ్లూ’ చీరలో రష్మిక మందన్నా.. అద్భుతమైన లుక్‌తో ఘన నివాళి! నూతన డీఎస్పీ శ్రీనివాసరావుకు మర్యాదపూర్వకంగా కలిసిన వెంకట శివుడు యాదవ్ హత్యాయత్నం కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడి అరెస్ట్ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు ధన్యవాదములు :AMC చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్ నార్పలలో అక్రమ పనులు నిలుపుదల చేయాలని వినతి నవంబర్‌లో సాయి పల్లవి గ్రాండ్ కంబ్యాక్.. సరిగ్గా రెండు వారాల గ్యాప్‌లో రెండు భారీ చిత్రాల విడుదల! ఆంగ్లేయుల వెన్నుల్లో వణుకు పుట్టించిన యోధుడు వడ్డె ఓబన్న కలెక్టర్‌ను కలిసిన ఇండియన్ రెడ్‌క్రాస్ నూతన కార్యవర్గం షాద్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి బేరా సొసైటీ డెడ్ బాడీ ఫ్రీజర్ విరాళం: విద్యార్థులకు నాణ్యమైన భోజనం, స్వచ్ఛమైన త్రాగునీరు, నాణ్యమైన గుడ్లు అందించాలి – ఎస్ ఎఫ్ ఐ ఆపదలో పేదలకు భరోసాగా సీఎం సహాయనిధి సబ్ స్టేషన్ ముందు రైతుల ధర్నా

ఎన్నికల వ్యవస్థను బ్రష్టు పట్టింది బిజెపి

Select Suryaa Now
ఎన్నికల వ్యవస్థను బ్రష్టు పట్టింది బిజెపి

రాజమహేంద్రవరం: 

దేశంలో మోడీ నాయకత్వంలోని బిజేపి ప్రభుత్వం ఎన్నికల వ్యవస్ధను భ్రష్టు పట్టించిందని కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇన్‌చార్జి టికె విశ్వేశ్వరరెడ్డి అరోపించారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో టికె మాట్లాడుతూ సర్ పేరుతో దేశంలో 13కోట్ల మంది ఓట్లను చోరీ చేసిందన్నారు. ఓట్ల చోరీతో బిజేపి అధికారంలోకి వస్తుందని ఆరోపించారు. గత ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని స్వయంగా కేంద్ర ఆర్ధికమంత్రి భర్త పరకాల ప్రభాకర్ ఆరోపించారని గుర్తు చేశారు. జ్ఞానేశ్వర్ కుమార్‌ను అడ్డుపెట్టకుని ఓట్ల చోరీకి పాల్పడుతున్నారని, ఎంఎల్‌సి సోము వీర్రాజు దీనిని సమర్ధించుకోవడం హాస్పాస్పదమన్నారు. ఓట్ల చోరీపై రాహుల్ గాంధీ పోరాటానికి దేశవ్యాప్తంగా మద్దతు వస్తుందన్నారు. బిజేపి ఓట్లను చోరీ చేయడమే కాదని, దేశాన్ని కూడా చోరీ చేస్తుందన్నారు. దేశ సంపదను మోదీ తనకు బినామీలుగా ఉన్నవారికి దోచుపెడుతున్నారని ఆరోపించారు. మోదీ గద్దె దిగితేనే గానీ దేశ ప్రశలకు శాంతి ఉండదన్నారు. విలేకరుల సమావేశంలో నగర కాంగ్రెస్ అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్, నాయకులు ఆకుల సూర్య భాగ్యలక్ష్మి, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.