సిమెంట్ బెంచీలు బహుకరణ
ప్రజల సౌకర్యార్థం సామాజిక సేవలు అందించడంలో స్వర్ణాంధ్ర సేవా సంస్థ ఆదర్శనీయమైన పనితీరును కనబరుస్తుందని మాజీ కార్పొరేటర్ మదర్ తెరిసా మిలీనియం యూత్ వ్యవస్థాపకులు అజరపు వాసు అన్నారు. మంగళవారం ఉదయం స్థానిక లాలాచెరువు గణపతి ఆలయం, సంజీవ్ నగర్ రామాలయం, లాలాచెరువు విజయేశ్వరీ నగర్ లలో స్వర్ణాంధ్ర ఏర్పాటుచేసిన బెంచీలను వాసు చేతుల మీదుగా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వాసు మాట్లాడుతూ స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమ నిర్వహణ తోపాటు ఉచిత మొబైల్ అన్నదాన సేవలు, చిరు వ్యాపారులకు జంబో గొడుగుల పంపిణీ, మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ అందిస్తూ సేవలకు బ్రాండ్ అంబాసిడర్ గా స్వర్ణాంధ్ర రాంబాబు నిలుస్తార న్నారు. దాతలు సహకారంతో మూడు దశాబ్దాలుగా సేవలందిస్తున్న రాంబాబు కు అందరూ సహకరించాలని వాసు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా స్వర్ణాంధ్ర ముఖ్య నిర్వాహకులు స్వర్ణాంధ్ర రాంబాబు మాట్లాడుతూ ఇప్పటివరకు నగరంలో పార్కులు ఇతర దేవాలయాలు అడిగిన అన్నిచోట్ల సుమారు 300 సిమెంట్ బెంచీలు ఏర్పాటు చేశామన్నారు. స్వర్ణాంధ్ర సేవా సంస్థకు సహకరించిన దాతలకు రాంబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దువ్వాడ రాజా, ఆదిరెడ్డి చిన్ని, శ్రీను, అప్పారావు ,మీరా కుమారి తదితరులు పాల్గొన్నారు.