BREAKING
సల్మాన్ ఖాన్ ‘మాతృభూమి’ సినిమా విడుదలకు అడ్డంకులు తొలగిపోయాక కీలక మార్పులు! దసరా నవరాత్రి ఉత్సవాలకు సిద్ధమైన అమ్మవారి ఆలయం లక్ష్మక్కపల్లి చెక్‌డ్యామ్‌పై అధికారుల పరిశీలన ఎం.ఎస్. సుబ్బలక్ష్మి ఐకానిక్ ‘ఎంఎస్ బ్లూ’ చీరలో రష్మిక మందన్నా.. అద్భుతమైన లుక్‌తో ఘన నివాళి! నూతన డీఎస్పీ శ్రీనివాసరావుకు మర్యాదపూర్వకంగా కలిసిన వెంకట శివుడు యాదవ్ హత్యాయత్నం కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడి అరెస్ట్ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు ధన్యవాదములు :AMC చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్ నార్పలలో అక్రమ పనులు నిలుపుదల చేయాలని వినతి నవంబర్‌లో సాయి పల్లవి గ్రాండ్ కంబ్యాక్.. సరిగ్గా రెండు వారాల గ్యాప్‌లో రెండు భారీ చిత్రాల విడుదల! ఆంగ్లేయుల వెన్నుల్లో వణుకు పుట్టించిన యోధుడు వడ్డె ఓబన్న కలెక్టర్‌ను కలిసిన ఇండియన్ రెడ్‌క్రాస్ నూతన కార్యవర్గం షాద్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి బేరా సొసైటీ డెడ్ బాడీ ఫ్రీజర్ విరాళం: విద్యార్థులకు నాణ్యమైన భోజనం, స్వచ్ఛమైన త్రాగునీరు, నాణ్యమైన గుడ్లు అందించాలి – ఎస్ ఎఫ్ ఐ ఆపదలో పేదలకు భరోసాగా సీఎం సహాయనిధి సబ్ స్టేషన్ ముందు రైతుల ధర్నా

రైతు బజార్ అక్రమ వసూళ్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలి కాంగ్రెస్ డిమాండ్

Select Suryaa Now
రైతు బజార్ అక్రమ వసూళ్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలి  కాంగ్రెస్ డిమాండ్

రైతు బజార్ అక్రమ వసూళ్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలి.. కాంగ్రెస్ పార్టీ డిమాండ్

వేంపల్లె మేజర్ న్యూస్:
స్థానిక రైతు బజార్ లో నెలకొని ఉన్న అక్రమ వసూళ్లపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ పులివెందుల నియోజకవర్గ ఇంచార్జీ మూలంరెడ్డి దృవకుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆ మేరకు మంగళవారం స్థానిక పంచాయతీ కార్యాలయంలో డిప్యూటీ ఎంపిడిఓ రమణయ్య, ఇఓ కవిత లకు వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ రైతులకు, వినియోగదారులకు ఉపయోగ పడే విధంగా రైతు బజార్ లను ఏర్పాటు చేశారన్నారు. అయితే వేలం పాట పాడిన కాంట్రాక్టర్ ఒక్కో మూట మీద రూ. 40, టమోటా బాక్స్ పై రూ.20 లు వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు. అలాగే రైతు బజార్ లోని చిన్న గదికి నెలకు రూ. 3 వేలు, ముందు భాగాన రోజుకు రూ.300 లు గేటు వసూలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇదంతా రైతు బజార్ కి విచ్చేసే కొనుగోలు దారులపై భారం పడుతోందన్నారు. టెండర్ పాడిన కాంట్రాక్టర్, గ్రామ పంచాయతీ కోసం రైతు బజార్ ఏర్పాటు చేసినట్లు ఉందన్నారు. ఈ విషయంపై అధికారులు స్పందించి సంబంధిత వాటిపై నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రామకృష్ణ, వేమయ్య, రవీంద్రారెడ్డి, వెంకటేష్, బద్రీ, ఉత్తన్న, అమర్, రాఘవయ్య, శివ తదితరులు పాల్గొన్నారు.

గండికోట షేక్ ఖదీర్, వేంపల్లె.