BREAKING
సల్మాన్ ఖాన్ ‘మాతృభూమి’ సినిమా విడుదలకు అడ్డంకులు తొలగిపోయాక కీలక మార్పులు! దసరా నవరాత్రి ఉత్సవాలకు సిద్ధమైన అమ్మవారి ఆలయం లక్ష్మక్కపల్లి చెక్‌డ్యామ్‌పై అధికారుల పరిశీలన ఎం.ఎస్. సుబ్బలక్ష్మి ఐకానిక్ ‘ఎంఎస్ బ్లూ’ చీరలో రష్మిక మందన్నా.. అద్భుతమైన లుక్‌తో ఘన నివాళి! నూతన డీఎస్పీ శ్రీనివాసరావుకు మర్యాదపూర్వకంగా కలిసిన వెంకట శివుడు యాదవ్ హత్యాయత్నం కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడి అరెస్ట్ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు ధన్యవాదములు :AMC చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్ నార్పలలో అక్రమ పనులు నిలుపుదల చేయాలని వినతి నవంబర్‌లో సాయి పల్లవి గ్రాండ్ కంబ్యాక్.. సరిగ్గా రెండు వారాల గ్యాప్‌లో రెండు భారీ చిత్రాల విడుదల! ఆంగ్లేయుల వెన్నుల్లో వణుకు పుట్టించిన యోధుడు వడ్డె ఓబన్న కలెక్టర్‌ను కలిసిన ఇండియన్ రెడ్‌క్రాస్ నూతన కార్యవర్గం షాద్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి బేరా సొసైటీ డెడ్ బాడీ ఫ్రీజర్ విరాళం: విద్యార్థులకు నాణ్యమైన భోజనం, స్వచ్ఛమైన త్రాగునీరు, నాణ్యమైన గుడ్లు అందించాలి – ఎస్ ఎఫ్ ఐ ఆపదలో పేదలకు భరోసాగా సీఎం సహాయనిధి సబ్ స్టేషన్ ముందు రైతుల ధర్నా

శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం.

Select Suryaa Now
శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం.

అమరావతి, సూర్య ప్రతినిధి : శ్రీశైలం శ్రీభ్రమరాంబా మల్లిఖార్జున స్వామి దేవాలయంలో జరుగనున్న దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబును దేవస్థాన ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారులు ఆహ్వానం పలికారు. ఈ నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను నిర్వహించనున్నట్టు ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ మేరకు ఆలయ బోర్డు ఛైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, ఈవో యం.శ్రీనివాసరావు, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రికి ఆహ్వాన పత్రిక అందించారు. శ్రీశైల దేవస్థానం ఆలయ పండితులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు వేదాశీర్వచనం పలికారు. సీఎంకు శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల చిత్రపటం, ప్రసాదాలను దేవాలయ అధికారులు అందించారు. బ్రహ్మోత్సవాలకు సంబంధించి దేవస్థానం చేస్తున్న ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.