జనాల చెవులలో పువ్వులు పెట్టొద్దు చెవిరెడ్డి.
సూర్య దర్శి.
బూచేపల్లి అసమర్థత కూటమి కక్ష సాధింపు అవుతుందా.
అబద్ధపు రాతలు అసత్య ప్రచారాలు గొడ్డలి పార్టీ పేటెంట్.
ఉనికి కోసం వైసిపి తాపత్రయం.
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ఓర్వలేక టీడీపీ పై నిందారోపణలు.
విలేకరుల సమావేశంలో దర్శి టిడిపి నాయకులు.
బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి క్వారీ నడపలేక మూసివేస్తే కూటమి ప్రభుత్వం కక్ష సాధిస్తుందని చెప్పడం నీ అబద్ధపు ప్రచారాలకు పరాకాష్టఅని బూచేపల్లి అసమర్ధత కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు అవుతుందా? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని సూటిగా. దర్శి టిడిపి నాయకులు ప్రశ్నించారు ప్రశ్నించారు. స్థానిక టిడిపి కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. మీ అబద్ధాల కరపత్రం సాక్షి దినపత్రికలో తప్ప విలువలు, విశ్వాసనీయతలతో నడిపే ఏ పత్రికలోనైనా బూచేపల్లి క్వారీ మూయించి కూటమి ప్రభుత్వం కక్ష సాధిస్తుందని రాశారా?అబద్ధపు రాతలు రాయించడం అబద్దాలను ప్రచారం చేయడం మీ గొడ్డలి పార్టీ పేటెంట్ రైట్ గా మారిందన్నారు. వైఫల్యం చెందింది కూటమి ప్రభుత్వం కాదు. అసెంబ్లీకి వెళితే మీ అవినీతి బండారాన్ని కూటమి ఎమ్మెల్యేలు అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు వివరిస్తారని భయపడి పారిపోతు వైఫల్యం చెందుతుంది మీ నాయకుడు జగన్ రెడ్డి అన్నారు. మద్యం స్కాములు చేసి స్కాములు బయటపడితే కక్ష సాధింపులుగా, గొడ్డలివేట్లను గుండెపోటుగా చిత్రీకరించి విఫలమవడంతో నారా సుర రక్త చరిత్ర అంటూ అబద్ధపు ప్రచారాలు, కోడి కత్తి డ్రామాలు ఇలా తప్పులు మీద తప్పులు చేయడం తప్పులు బయట పెడితే కక్ష సాధింపులు అని ప్రచారం చేయడం మీకు వెన్నతో పెట్టిన విద్య. అన్నారు.
మీ అసమర్థతలను కక్ష సాధింపులనే అబద్ధపు ప్రచారాలను మానుకోకపోతే ఇక మీ అబద్ధపు ప్రచారాలను భరించే సహనం ప్రజలకు లేదు. ప్రజాక్షేత్రంలో మీకు బడితి పూజ చేస్తారు అని దర్శి నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ని ఘాటుగా విమర్శించారు. ఈ పత్రికా సమావేశం లో దర్శి సొసైటీఅధ్యక్షులు కలువకొలను చంద్రశేఖర్, దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, దర్శి మండల టిడిపి అధ్యక్షులు మారెళ్ల వెంకటేశ్వర్లు, దర్శి నీటి సంఘం డి.సి చైర్మన్ కామిరెడ్డి వెలుగొండారెడ్డి, దర్శి రామాలయం దేవస్థానం చైర్మన్ మునగా శ్రీను, వార్డ్ కౌన్సిలర్ ఇత్తడి సునీత - దినకర్, గొర్రె సుబ్బారెడ్డి, జూపల్లి కోటేశ్వరరావు, రూపీనేని వెంకట్రావు, ఊరిబిండి మధు, కంచర్ల శ్రీను, అంబటి వెంకటేశ్వర రెడ్డి, జయరావు తదితరులు పాల్గొన్నారు.