4,563 మొబైల్ ఫోన్లను రికవరీ చేయగా, వాటి విలువ సుమారు రూ.11.40 కోట్లు. రికవరీ రికవరీ
ఏలూరు, మేజర్ న్యూస్: జిల్లా వ్యాప్తంగా సెప్టెంబర్‌లో పోలీసులు 200 పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను రికవరీ చేశారు. వీటి విలువ సుమారు రూ.50 లక్షలు. ఇప్పటివరకు జిల్లాలో మొత్తం 4,563 మొబైల్ ఫోన్లను రికవరీ చేయగా, వాటి విలువ సుమారు రూ.11.40 కోట్లు. రికవరీ చేసిన ఫోన్లను అధికారులు సంబంధిత బాధితులకు అందజేస్తున్నారు. మొబైల్ పోగొట్టుకున్న వారు వెంటనే సీఈఐఆర్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని లేదా సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని పోలీసులు సూచించారు. సాంకేతిక పరిజ్ఞానంతో ఫోన్లను గుర్తించి బాధితులకు అప్పగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ రవి కిషోర్ తో పాటు వారి టీం అందరినీ పలువురు అభినందించారు.