BREAKING
మిట్స్‌ వర్సిటీలో ఘనంగా భారత వైమానిక దళ దినోత్సవం రోడ్డుప్రమాదంలో ఒకరు మృతి, ఇద్దరికీ గాయాలు ఈనెల 12 నుండి బోయకొండలో శరన్నవరాత్రి ఉత్సవాలు టమోటా మార్కెట్ అభివృద్ధిలో కీలక సంస్కరణలు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పూర్తిస్థాయిలో సన్నద్ధత గ్యార్మీ మహోత్సవం(జెండా పండుగ) కార్యక్రమంలో పాల్గొన్న....... ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ గుజరాత్‌లో సబర్మతి రైల్వే స్టేషన్ పునర్నిర్మాణం తుది దశకు: 85 శాతానికి పైగా పనులు పూర్తి. మునగ ప్లాంటేషన్ పనులను పరిశీలించిన జెడ్పీ సీఈఓ బిసి సంక్షేమ గురుకుల పాఠశాలకు ఐదు సీలింగ్ ఫ్యాన్లు వితరణ పరిహారం ఇవ్వకుండా పనులెలా చేస్తారు? తాటిపూడి బాలికల గురుకుల కళాశాల సమస్యలను పరిష్కరించాలి అక్టోబర్ 11 నుండి శతచండీ మహోరుద్ర యాగ మహోత్సవాలు మాజీ జెడ్పీటీసీ ఏడుకొండల కుటుంబానికి మంత్రి గొట్టిపాటి పరామర్శ సాగునీరు అందించాలి పదో తరగతి విద్యార్థులకు ఉచితంగా 'గణిత దీప్తి' పుస్తకాల పంపిణీ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అరెస్ట్ అప్రజాస్వామికం

Select Suryaa Now
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అరెస్ట్ అప్రజాస్వామికం


- ఖండించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్.కె బాషా,కొండపల్లి ఆనంద్ 
మదనపల్లె : ఓట్ చోరీపై డిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఇండియా కూటమి ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీని అరెస్ట్ చేయడం దుర్మార్గమని కాంగ్రెస్ పార్టీ మైనార్టీ ఎపి రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్.కె బాషా,అన్నమయ్య జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కొండపల్లి ఆనంద్ లు ఖండించారు.ఈ సందర్బంగా బుధవారం స్థానిక ఎస్.కె బాషా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్రంలో ఎన్డిఏ కూటమికి అనుకూలంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఓట్ చోరీ జరుగుతొందని గత కొంత కాలంగా రాహుల్ గాంధీ ప్రజలను జాగృతం చేశారని,ఈనాడు అది నిజమేనని బయట పడటంతో యావత్ దేశం దీనిపై అప్రమత్తమైందన్నారు.విపక్ష పార్టీలు అన్ని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ తీసుకుంటున్న నిర్ణయాలను ప్రశ్నిస్తూ,రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం జరుగుతోందన్నారు.ఇప్పటికే దేశ వ్యాప్తంగా 13.50 కోట్ల ఓట్లు తొలగించినట్లు అదికారికంగా లెక్కలు చెబుతున్నాయిని,ఇవి మరింత ఎక్కువగా వుండే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.ఇందుకు బాధ్యత వహిస్తూ ప్రధాన ఎన్నికల కమీషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సాదిక్ అలీ పాల్గొన్నారు.

 

కె.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జ్