కదిరి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి
కదిరి పట్టణంలోని శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామిని సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి. సుజాత దర్శించుకున్నారు. న్యాయమూర్తిరాకపై ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో స్వామి వారి ప్రత్యేక పూజా కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి పాల్గొన్నారు. పూజల అనంతరం అర్చకులు తీర్థ ప్రసాదాలతో పాటు స్వామి వారి చిత్ర పటాన్ని న్యాయమూర్తికి బహుకరించారు. ఆపై శేష వస్త్రం కప్పి సన్మానించారు. కార్యక్రమంలో అనంతపురం ఫస్ట్ అడిష నల్ డిస్ట్రిక్ట్ జడ్జి (ఏడీజే) సత్యవాణి, కదిరి ఏజేఎఫ్‌సీఎం న్యాయమూర్తి లోకనాథంలు వారి వెంట ఉన్నారు.