కడపలో వృద్ధ అర్చకుడు పై దాడి. న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య డిమాండ్
ఆళ్లగడ్డ మేజర్ న్యూస్;
కడపలోని వెంకటాద్రి అపార్ట్మెంట్స్‌లో నివాసం ఉంటున్న హౌసింగ్ బోర్డ్ రామాలయ ప్రధాన అర్చకుల కుటుంబంపై దాడి జరిగినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనలో వృద్ధ అర్చకులు తీవ్రంగా గాయపడ్డారు.
బాధిత కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం, పక్క ఫ్లాట్‌కు చెందిన వ్యక్తి అర్చకుల ఇంట్లోకి ప్రవేశించి గొడవకు దిగినట్లు ఆరోపణ ఉంది. ఈ క్రమంలో మహిళలపై చేయి చేసుకున్నారని, అడ్డుకోబోయిన వృద్ధ అర్చకుడిని కిందపడేసి దాడి చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.ఈ దాడిలో వృద్ధ అర్చకుడి ఎడమ కాలు విరిగినట్లు వైద్యులు నిర్ధారించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన ఆయనను మొదట కడప రిమ్స్‌కు, అక్కడి నుండి మెరుగైన వైద్యం కోసం హిమబిందు హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని కడప వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు తెలిసింది.అపార్ట్మెంట్ వాసులు గత కొద్ది రోజులుగా ఇలాంటి వేధింపులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారని బాధిత కుటుంబం పేర్కొంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య మాజీ అధ్యక్షులు వెంకట రామరాజు మాట్లాడుతూ తాము నాలుగు డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచుతున్నామన్నారు.1. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిష్పక్షపాతంగా విచారణ జరపాలి. • 2. మహిళలపై, వృద్ధ అర్చకుడిపై దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి. • 3. బాధిత కుటుంబానికి, అపార్ట్మెంట్ వాసులకు రక్షణ కల్పించాలి. • 4. గాయపడిన వృద్ధ అర్చకుడికి పూర్తి వైద్య సహాయం అందించాలి. వృద్ధులు, మహిళలు, అర్చక కుటుంబాలపై ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా పోలీసు యంత్రాంగం తక్షణమే స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నామన్నారు.
శ్రీనివాస్ ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా