BREAKING
కళ్యాణదుర్గం మున్సిపాలిటీ చైర్మన్ ఉప చైర్మన్ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారానికి స్థల పరిశీలన. రైతులకు విత్తనాల పంపిణీ 15వ వార్డులో రూపేష్ గుప్తాకు జననీరాజనం.. అడుగడుగునా ఆత్మీయ స్వాగతం! లస్మన్నపల్లిలో ఇందిరమ్మ బీమా నమోదు ప్రారంభం కడపలో వృద్ధ అర్చకుడు పై దాడి. న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య డిమాండ్ సమస్యలపై గళమెత్తిన సర్పంచులు సర్పంచ్ఎ న్నికలు ప్రశాంతంగా జరగాలి. జిల్లా కలెక్టర్ కు వినతి. వెంకటగిరి ఎంపిపిగా తంబాకుల రాజేశ్వరి గొట్టిపాటి లక్ష్మి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తా. అవులమంద సర్పంచ్ టిడిపి అభ్యర్థి గొట్టిపాటి వెంకటేశ్వర్లు. చేయి దాటిపోయింది మైనారిటీ అభ్యర్థులు గ్రూప్-3 ఉచిత ఫౌండేషన్ కోచింగ్‌ను సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఇన్‌చార్జి అధికారి సుధీర్ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు - సీఐ గోపతి రవీందర్ రాణిగంజ్ అండర్ బ్రిడ్జి పనులు. నేటి నుంచే ట్రాఫిక్ ఆంక్షలు! భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు - ఎంపీ సునీల్ మంత్రి ఫరూక్ ను కలిసిన జిల్లా పరిషత్ చైర్ పర్సన్ షేక్ బృహనుద్దీన్

15వ వార్డులో రూపేష్ గుప్తాకు జననీరాజనం.. అడుగడుగునా ఆత్మీయ స్వాగతం!

Select Suryaa Now
15వ వార్డులో రూపేష్ గుప్తాకు జననీరాజనం..   అడుగడుగునా ఆత్మీయ స్వాగతం!

నరసరావుపేట : మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి నాగసరపు రూపేష్ గుప్తాకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక 15వ వార్డులో ఆయన నిర్వహించిన పర్యటన జనసందోహంతో సందడిగా సాగింది. అడుగడుగునా ప్రజల ఆత్మీయత, మహిళల హారతులు, పూలవర్షంతో రూపేష్ గుప్తాకు వార్డులో ఘన స్వాగతం లభించింది. వార్డులోని ప్రతి వీధిలో ఇంటింటికీ వెళ్లిన ఆయన స్థానిక ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలిచి ఆశీర్వదించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఆయన ప్రచారానికి మహిళలు, యువత, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో 15వ వార్డులో ఎన్నికల సందడి నెలకొంది. ఈ సందర్భంగా నాగసరపు రూపేష్ గుప్తా మాట్లాడుతూ.. నరసరావుపేట పట్టణాన్ని అభివృద్ధిలో ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. తాగునీటి సమస్య, డ్రైనేజీ వ్యవస్థ, అంతర్గత రహదారులు, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాల సమస్య లను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల ఆశీస్సులతో చైర్మన్‌గా ఎన్నికైతే వార్డు అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి, అవసరమైన నిధులు కేటాయించేలా చర్యలు తీసుకుంటానని భరోసా ఇచ్చారు. ఈ ప్రచార కార్యక్రమంలో పార్టీ నాయకులు, 15వ వార్డు ముఖ్య నేతలు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పూలవర్షాలు, హారతులు, నినాదాలతో ప్రచార కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది.

మల్లికార్జునరావు పల్నాడు జిల్లా ఇన్చార్జి..