BREAKING
చేయి దాటిపోయింది మైనారిటీ అభ్యర్థులు గ్రూప్-3 ఉచిత ఫౌండేషన్ కోచింగ్‌ను సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఇన్‌చార్జి అధికారి సుధీర్ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు - సీఐ గోపతి రవీందర్ రాణిగంజ్ అండర్ బ్రిడ్జి పనులు. నేటి నుంచే ట్రాఫిక్ ఆంక్షలు! భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు - ఎంపీ సునీల్ మంత్రి ఫరూక్ ను కలిసిన జిల్లా పరిషత్ చైర్ పర్సన్ షేక్ బృహనుద్దీన్ కేవలం పది నిమిషాలు మాత్రమే! ఒకప్పటి వెలుగులు.. నేటి సవాళ్లు! కొవ్వూరి సాయి రత్న హాసిని రెడ్డికి స్వర్ణ పతకం దేవుడికి కొబ్బరికాయ ఎందుకు కొడతారు? దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక, వైజ్ఞానిక రహస్యాలు! నూతన చేయుత పెన్షన్లను అందజేసిన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారులు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సిద్ధార్థనగర్‌ పార్కులో అభివృద్ధి పనులు ప్రారంభం 10 రోజుల పాటు పార్కు మూసివేత ఆకాశంలో ఓ కొత్త తార.. వెలుగుల విందుతో కనువిందు చేసిన ఉల్కాపాతం! ప్రత్యేక ఓటరు జాబితా సవరణను రద్దు చేయాలి చింతలమానేపల్లి లో చేయూత పెన్షన్ల ప్రొసీడింగ్స్ పత్రాల పంపిణీ

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు - సీఐ గోపతి రవీందర్

Select Suryaa Now
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు - సీఐ గోపతి రవీందర్

సూర్య నస్పూర్:పాత నేరస్తులు తమ ప్రవర్తన మార్చుకొని సమాజంలో గౌరవప్రదంగా జీవించాలని, లేనిపక్షంలో వారిపై రౌడీషీట్లు తెరుస్తామని మంచిర్యాల రూరల్ సీఐ గోపతి రవీందర్ హెచ్చరించారు. శుక్రవారం సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలువురు పాత నేరస్తుల ఇళ్లకు స్వయంగా వెళ్లి వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.గతంలో నమోదైన కేసులు, ప్రస్తుత ప్రవర్తన, జీవన విధానం తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారికి కౌన్సెలింగ్ నిర్వహించి పలు సూచనలు చేశారు. గతంలో నేరాలకు పాల్పడిన వారు ఇకపై అలాంటి చర్యలకు దూరంగా ఉండాలని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకుండా కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంతమైన జీవితం గడపాలని సీఐ సూచించారు. పోలీసుల నిఘా నిరంతరం ఉంటుందని, ప్రవర్తనలో మార్పు రాకుండా తిరిగి నేరాలకు పాల్పడితే రౌడీషీట్లు తెరవడంతో పాటు చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.