telangana
భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు - ఎంపీ సునీల్
సికింద్రాబాద్ మేజర్ న్యూస్ : ఈ కార్యక్రమం ఎంపీ సునీల్ మాజీ డిసిసి ప్రధాన కార్యదర్శి,& మెరుగు జగదీశ్వర్ అధ్యక్షుడు పద్మారావు నగర్ డివిజన్ ఆధ్వర్యంలో జనహిత సేవ ట్రస్ట్ విశ్రాంతిభవనంలో అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సికింద్రాబాద్ డిసిసి అధ్యక్షులు కే దీపక్ జాన్ అన్నదానం వితరణ చేశారు
భారతదేశ చరిత్రలో చెరగని ముద్ర వేసిన మహా నాయకురాలు, దేశ తొలి మహిళా ప్రధానమంత్రి, భారతరత్న శ్రీమతి ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఆమెకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నాము.
దేశ సమగ్రత, సార్వభౌమాధికారం, పేదల సంక్షేమం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప నాయకురాలు ఇందిరా గాంధీ . బ్యాంకుల జాతీయీకరణ, పేదరిక నిర్మూలన, హరిత విప్లవం, అంతరిక్ష, అణు రంగాల్లో దేశాన్ని ముందుకు తీసుకెళ్లిన దార్శనికురాలు ఆమె.
“దేశం కోసం ప్రాణాలైనా అర్పిస్తాను” అని చెప్పి, దేశ ఐక్యత కోసం ప్రాణత్యాగం చేసిన ఆమె త్యాగం ఎప్పటికీ మరువలేనిది. మహిళా సాధికారతకు, సామాజిక న్యాయానికి ఆమె జీవితమే స్ఫూర్తి.
ఆమె ఆశయాలను, ఆదర్శాలను కొనసాగిస్తూ, కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలబడుతుందని తెలియజేస్తున్నాం
ఈ కార్యక్రమంలో మాజీ డిసిసి ప్రధాన కార్యదర్శి ఎంపీ సునీల్, యాదవ చారి, వేద ప్రకాష్ యాదవ్ మల్లం రమేష్, సిపి శంకర్,దినేష్ కుమార్, మహేష్ భాగ్యమ్మ సిహెచ్ శివ కుమార ప్రవీణ్ చారి,సి.ఎస్, సునీల్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు