మైనారిటీ అభ్యర్థులు గ్రూప్-3 ఉచిత ఫౌండేషన్ కోచింగ్‌ను సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఇన్‌చార్జి అధికారి సుధీర్
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మైనారిటీల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో టీజీపీఎస్సీ గ్రూప్-3 పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే మైనారిటీ అభ్యర్థులకు ఉచిత ఫౌండేషన్ కోచింగ్ అందించనున్నట్లు వికారాబాద్ జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఇన్‌చార్జి అధికారి సుధీర్ తెలిపారు. ఈ శిక్షణ కోసం అర్హులైన మైనారిటీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్రానికి చెందిన ముస్లిం, క్రైస్తవ, సిక్కు, జైన, పార్శీ, బౌద్ధ మైనారిటీ వర్గాల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని తెలిపారు. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని వెల్లడించారు.నవంబర్ 17 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైందని, నవంబర్ 26 దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ అని తెలిపారు. నవంబర్ 27 నుంచి ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయని, మొత్తం 100 మంది అభ్యర్థులకు మాత్రమే శిక్షణలో ప్రవేశం కల్పించనున్నట్లు వివరించారు.దరఖాస్తు నమోదు సమయంలో విద్యార్హతలకు సంబంధించిన అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఒరిజినల్ ఆధార్ కార్డు (డిజిటల్ స్కానింగ్ కోసం), ఒక పాస్‌పోర్ట్ సైజు ఫొటో తీసుకురావాలని సూచించారు.దరఖాస్తుల నమోదు, శిక్షణ కేంద్రం హైదరాబాద్‌లోని ఘోషామహల్, నాంపల్లిలో ఉన్న తెలంగాణ మైనారిటీస్ స్టడీ సర్కిల్, ఇందిరా ప్రియదర్శిని డిగ్రీ కళాశాల ప్రాంగణం, ఎంఏఎం క్యాంపస్, ఇంటర్మీడియట్ బోర్డు వెనుక, శ్రీ బాలాజీ ఎన్క్లేవ్‌లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు.మరిన్ని వివరాల కోసం పని దినాల్లో ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 040-23236112, 9059050062 నంబర్లను సంప్రదించాలని లేదా directorsmccctelangana@gmail.com ఈమెయిల్ ద్వారా వివరాలు పొందవచ్చని సుధీర్ తెలిపారు. అర్హులైన మైనారిటీ అభ్యర్థులు ఈ ఉచిత శిక్షణ అవకాశాన్ని వినియోగించుకుని పోటీ పరీక్షల్లో విజయం సాధించాలని ఆయన కోరారు